- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bata: గడువు కంటే ముందే జీఎస్టీ రేట్లు తగ్గించిన బాటా ఇండియా
రూ. 1,000 కంటే తక్కువ ఖరీదైన పాదరక్షలపై రాబోయే జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను బదిలీ చేసినట్టు వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ రెండు శ్లాబులకు కుదించిన సంగతి తెలిసిందే. తాజా 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఫుట్‌వేర్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీన్ని ఈ నెల 22 నుంచి అమలు చేయనుండగా, ప్రముఖ ఫుట్‌వేర్ దిగ్గజం బాటా ఇండియా మాత్రం గడువు కంటే ముందుగా కస్టమర్లకు తక్కువ రేట్ల ప్రయోజనాలను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది. గురువారం కంపెనీ తన 'బాటా ప్రైస్ ప్రామిస్' నిర్ణయాన్ని ప్రారంభించామని, రూ. 1,000 కంటే తక్కువ ఖరీదైన పాదరక్షలపై రాబోయే జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను బదిలీ చేసినట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని బాటా ఔట్‌లెట్‌లలో 7 శాతం తగ్గింపు అందిస్తున్నామని, కొనుగోలుదారులు తక్షణ తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ అధికారికంగా స్పష్టం చేసింది. బాటా ప్రాధాన్యత ఫ్యాషన్‌తో పాటు సౌకర్యాలను ప్రతి వినియోగదారుడికి అందుబాటులో ఉంచడం. కాబట్టి ఎంపిక చేసిన పాదరక్షలపై జీఎస్టీని తక్షణం అమలు చేశామని, పండుగ సీజన్ షాపింగ్‌లో ప్రజలకు ఈ డిస్కౌంట్ అందించడం సంతోషంగా ఉందని బాటా ఇండియా ఎండీ, సీఈఓ గుంజన్ షా చెప్పారు.






