- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొరాయించిన IRCTC వెబ్‌సైట్, యాప్
రైల్వే బుకింగ్ వెబ్‌సైట్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) శనివారం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది

X
న్యూఢిల్లీ: రైల్వే బుకింగ్ వెబ్‌సైట్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) శనివారం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. తత్కాల్ టికెట్లు బుకింగ్ సమయంలో యాప్, వెబ్‌సైట్ మొరాయించాయి. దీంతో టికెట్ బుకింగ్ చేసుకోవాలనుకున్న వారు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ విషయంపై పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. IRCTC వెబ్‌సైట్, యాప్ రెండు శనివారం ఉదయం 10 గంటల నుంచి మొరాయించినట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ కూడా తెలిపింది. టికెట్ బుకింగ్ సమయంలో అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లుగా చూపించింది, కానీ టికెట్ మాత్రం బుక్ కాలేదని పలువురు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై IRCTC స్పందించలేదు. కానీ ప్రస్తుతానికి వెబ్‌సైట్ యధావిథిగా పనిచేస్తుంది.
Next Story






