- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Banks: 11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్ చేసిన బ్యాంకులు
2019-20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1.59 లక్షల కోట్ల విలువైన రుణాలను సాంకేతికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన 11 ఏళ్లలో దేశీయ బ్యాంకులు రూ. 9.75 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం తెలిపారు. ఈ మేరకు పార్లమెంటులో మాట్లాడుతూ.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1.59 లక్షల కోట్ల విలువైన రుణాలను సాంకేతికంగా రద్దు చేయగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో తక్కువగా రూ.47,568 కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన కాలానికి సంబంధించి 2014-15లో రూ. 31,723 కోట్లు, 2015-16లో రూ. 40,416 కోట్లు, 2016-17లో రూ. 68,308 కోట్లు, 2017-18లో రూ. 99,132 కోట్లు, 2018-19లో లక్ష కోట్ల మార్కును దాటి రూ. 1.59 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, 4 ఏళ్లు దాటిన మొండి బకాయిలను బ్యాంకులు రైటాఫ్ చేస్తాయి. అయితే, ఇది సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని, లోన్ తీసుకున్నవాళ్లు రుణాలను తిరిగి చెల్లించాల్సిందేనని సహాయ మంత్రి వివరించారు. రుణాల వసూలు ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని పేర్కొన్నారు.






