కస్టమర్లకు అలర్ట్.. వరుసగా నాలుగురోజులు బ్యాంకులు బంద్

by Naga Rani Yarlagadda |

బ్యాంకు లావాదేవీలు చేసుకోవాలని మంత్ ఎండింగ్ కు ప్లాన్ చేసుకుంటున్న కస్టమర్లకు ఇదొక అలర్ట్.. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకూ బ్యాంకులు మూతపడనున్నాయి.

కస్టమర్లకు అలర్ట్.. వరుసగా నాలుగురోజులు బ్యాంకులు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకు లావాదేవీలు చేసుకోవాలని మంత్ ఎండింగ్ కు ప్లాన్ చేసుకుంటున్న కస్టమర్లకు ఇదొక అలర్ట్.. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకూ బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిలో జనవరి 24వ తేదీ నాల్గవ శనివారం, 25 - ఆదివారం, 26 - గణతంత్ర దినోత్సవం, 27న 5-డే వర్క్ వీక్ డిమాండ్ తో బ్యాంకు ఉద్యోగులు సమ్మె ప్రకటించారు. 27న సమ్మె జరిగితే బ్యాంకులు వరుసగా నాలుగురోజులపాటు మూతపడే అవకాశం ఉంది.

ఐదురోజుల పని ఉంటే.. వర్క్ ప్రెజర్ తగ్గుతుందని, తమ కుటుంబాలకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతామని బ్యాంక్ ఉద్యోగులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఫైనాన్షియల్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ సంస్థలు 5-డే వర్క్ వీక్ రూల్ నే పాటిస్తున్నాయి. అందుకే తమకు కూడా అదే అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది అమలు చేస్తే.. వారంలో పనిచేసే 5 రోజులూ కస్టమర్ సర్వీసులపై ఎఫెక్ట్ పడకుండా అదనంగా 40 నిమిషాలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్(UFBU) ప్రకటించింది. దేశంలో 9 పెద్ద బ్యాంక్ యూనియన్లు ఇందులోనే ఉంటాయి.

Next Story