- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు దేశ క్రెడిట్ వృద్ధికి కీలకం
సంక్లిష్టమైన ప్రపంచ ఆర్థిక వాతావరణంలో స్థిరమైన రుణాల వృద్ధిని కొనసాగించడానికి పర్యవేక్షణ కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ క్రెడిట్ మార్కెట్‌లో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ఆధిపత్యం పెరుగుతోందని, నిశిత పర్యవేక్షణ అవసరమని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ఈ సంస్థలు దేశ క్రెడిట్ అవసరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా సంక్లిష్టమైన ప్రపంచ ఆర్థిక వాతావరణంలో స్థిరమైన రుణాల వృద్ధిని కొనసాగించడానికి తగిన పర్యవేక్షణ కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన వార్షిక బ్యాంకింగ్ సదస్సు ఎఫ్ఐబీఏసీ-2025 కార్యక్రమంలో మాట్లాడిన ఆర్‌బీఐ గవర్నర్.. బ్యాంకుల క్రెడిట్‌ను విస్తరించడానికి కావాల్సిన చర్యలను పరిశీలిస్తున్నాం. ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్‌కు వీలుగా కార్పొరేట్, బ్యాంకులు కలిసి పనిచేయాలి. అప్పుడే దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్లగలదు. బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల పర్యవేక్షణ ద్వారా క్రెడిట్ వృద్ధి స్థిరంగా ఉండేందుకు, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే లక్ష్యంతో ఆర్‌బీఐ విధానం కొనసాగుతుందని సంజయ్ మల్హోత్రా వివరించారు. దేశ విదేశీ మారక నిల్వలు 695 బిలియన్ డాలర్లతో బలంగా ఉన్నాయి, ఇది 11 నెలల విదేశీ వాణిజ్యానికి సరిపోతుంది. బ్యాంకు క్రెడిట్‌లను విస్తరించే చర్యలను పరిశీలిస్తున్నాం. అలాగే, 5-7 సంవత్సరాలకు ఒకసారి అన్ని నిబంధనలను సమీక్షించే రెగ్యులేటరీ రివ్యూ సెల్‌ను ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్టు సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.






