- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Banks: వచ్చే నెల దేశవ్యాప్త రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు యూనియన్లు
ఈ మేరకు 9 బ్యాంకుల ఉద్యోగుల సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే నెల బ్యాంకింగ్ రంగంలోని యూనియన్లు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 5 రోజుల పని, అన్ని కేడర్‌లలో తగిన రిక్రూట్‌మెంట్‌తో వివిధ డిమాండ్లను కోరుతూ బ్యాంక్ యూనియన్లు మార్చి 24 నుంచి రెండు రోజుల పాటు సమ్మె నిర్వహించనున్నారు. ఈ మేరకు 9 బ్యాంకుల ఉద్యోగుల సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) వెల్లడించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్‌మెన్/ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల భర్తీకి కూడా యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోంది. తగిన చర్చలు జరిపిన తర్వాత మార్చి 24,25 తేదీలలో సమ్మె నిర్వహించాలని నిర్ణయించినట్టు యూఎఫ్‌బీయూ శుక్రవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, ఉద్యోగ భద్రతకు ముప్పు, ఉద్యోగుల మధ్య విభజనను సృష్టించేలా పనితీరుపై సమీక్ష జరపడం, పనితీరు-సంబంధిత ప్రోత్సాహకాలపై ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని యూఎఫ్‌బీయూ స్పష్టం చేసింది. పాలసీ విషయాలకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో డీఎఫ్ఎస్ పరిశీలన జరపడం బ్యాంకు బోర్డుల స్వయంప్రతిపత్తిని బలహీనపరుస్తుందని అభిప్రాయపడింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ) వ్ద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపుతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు స్కీమ్ తరహాలో పరిమితిని రూ. 25 లక్షలకు పెంచడానికి గ్రాట్యూటీ చట్టాన్ని సవరించాలని పేర్కొంది.






