BOM: రిటైల్ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

by S Gopi |

గృహ, వాహన రుణాలతో సహా అన్ని రకాల రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయిట్ల మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.

BOM: రిటైల్ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం) రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ నెల ప్రారంభంలో దాదాపు ఐదేళ్ల తర్వాత కీలక రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఓఎం రెపో రేటుకు అనుగుణంగా గృహ, వాహన రుణాలతో సహా అన్ని రకాల రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయిట్ల మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. దీంతో బ్యాంకు అందించే ఇళ్ల రుణాల రేటు 8.1 0శాతానికి దిగొచ్చింది. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ రంగంలో అత్యల్పంగా ఉన్న రేట్లతో ఇదొకటని బ్యాంకు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇక, వాహనాల కోసం ఇచ్చే రుణాలపై 8.45 శాతం వార్షిక రేటుతో వడ్డీ రేటు ప్రారంభమవుతుందని, రెపో లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్) ఆధారంగా ఇచ్చే విద్య, ఇత్ర రుణాలపై కూడా వడ్డీ రేటు 0.25 శాతం తగ్గుతుందని బ్యాంకు తెలిపింది. బ్యాంకు ఇప్పటికే గృహ, వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఈ ప్రయోజనాలతో కస్టమర్లకు మెరుగైన ఫైనాన్స్ సదుపాయం లభిస్తుందని బ్యాంకు అభిప్రాయపడింది.

Next Story