- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bank Of India: ఎఫ్‌డీలపై వడ్డీ పెంచిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
1-2 ఏళ్ల లోపు కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.5 శాతానికి పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. రూ. 3 కోట్లలోపు ఎంపిక చేసిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు వెల్లడించింది. కొత్త రేట్లు మే 18 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా మార్పుల ప్రకారం, 1-2 ఏళ్ల లోపు కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.5 శాతానికి పెరిగింది. 2-3 ఏళ్ల లోపు డిపాజిట్లపై 6.6 శాతం, మూడేళ్ల కాలానికి చెందిన ఎఫ్‌డీలపై 6.7 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు బ్యాంకు తెలిపింది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అదనపు ప్రయోజనాలు కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది. దీనివల్ల ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు ఎఫ్‌డీలపై సాధారణ రేటుకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు 65 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది. మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 75 బేసిస్ పాయింట్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు 90 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ అందుతుంది. అలాగే, కనీసం ఏడాది కాలపరిమితితో రూ. 1 కోటి పైబడిన నాన్-కాల్‌బుల్ డిపాజిట్లపై వర్తించే రేటుకు అదనంగా 15 బేసిస్ పాయింట్ల వడ్డీ ఇవ్వనున్నట్టు బ్యాంక్ పేర్కొంది.






