- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BoB: మరింత చౌకగా కార్ లోన్
కార్ లోన్ వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. తగ్గించిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కొత్తగా కారు కొనాలనుకునే వారికి భారీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. కార్ లోన్ వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. తగ్గించిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ నిర్ణయంతో తన ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఇప్పుడు సంవత్సరానికి 7.6 శాతం నుంచి ప్రారంభమవుతుందని బీఓబీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో బరోడా కార్ లోన్‌లపై ఏడాదికి 8.5 శాతం నుంచి స్థిర వడ్డీ రేటును అమలు చేయనున్నట్టు వివరించింది. 7.6 శాతం నుంచి ప్రారంభమయ్యే కొత్త రేటు కొత్త కారు కొనుగోలు సమయంలోనే అందుబాటులో ఉంటుందని, ఇది కూడా రుణగ్రహీత క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది. తక్కువ వడ్డీ రేటును అందించడంతో పాటు, బ్యాంక్ కస్టమర్‌లకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండానే తమ కార్ లోన్‌ను ముందుగానే క్లియర్ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తోంది. అయితే ఇది కేవలం ఫ్లోటింగ్ రేట్ లోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మరింత సులభంగా చెప్పాలంటే, కార్ లోన్ తీసుకున్నవారు గడువు పూర్తవక ముందే లోన్‌ను ముగించవచ్చు. దీనికి బ్యాంక్ ఎలాంటి జరిమానా విధించదు. ఉదాహరణకు, ఐదేళ్ల కాలానికి కార్ లోన్ తీసుకున్నావారు, రెండేళ్ల తర్వాత, బోనస్ లేదా అదనపు సొమ్ము అందినప్పుడు లోన్ క్లియర్ చేయవచ్చు. దీనిపై బ్యాంక్ ఎలాంటి అదనపు ఛార్జీలు విధించదని పేర్కొంది.






