- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి మే (May) నెల ప్రారంభమైంది. ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చే వారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే.. మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు (Bank Holidays) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) జారీ చేసిన సెలవులు ప్రకారం.. శని, ఆదివారాలు, పండుగలు, పర్వదినాలు కలిపి ఏకంగా 13 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మరీ ఏ రోజు బ్యాంకులకు హాలిడే ఉండనుందో తెలుసుకుందామా?
ఆర్బీఐ సెలవుల జాబితా ప్రకారం బ్యాంకులకు రాష్ట్రాల వారిగా వేరు వేరుగా సెలవులు ఉంటాయి. ప్రాంతీయ పండగలు, జాతీయ సెలవులు, రాష్ట్ర పండగల వంటివి మారుతుంటాయి. ఈ క్రమంలో మే నెలలోనే ప్రాంతాల వారీగా వేరు వేరు పండగలు ఉన్నాయి. ఇక బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ సేవలు నిరంతరాయంగా పని చేయనున్నాయి. వాటి సహాయంతో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
మేలో సెలవుల వివరాలు ఇవే..
మే 1 : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
మే 4 : ఆదివారం
మే 9 : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
మే 10 : రెండో శనివారం
మే 11 : ఆదివారం
మే 12 : బుద్ధ పూర్ణిమ సందర్భంగా కర్ణాటకలో సెలవు, తెలంగాణలో ఆప్షనల్ హాలిడే.
మే 16 : సిక్కిం స్టేట్ డే సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
మే 18 : ఆదివారం
మే 24 : నాలుగో శనివారం
మే 25 : ఆదివారం
మే 26 : కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టిన రోజు సందర్భంగా ప్రాంతీయ సెలవు ఉంటుంది.
మే 29 : మహారాణా ప్రతాప్ జయంతి పలు రాష్ట్రాల్లో సెలవులు.
మే 30 : గురు అర్జున్ దేవ్ జీ బలిదానం దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే.






