- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bank Holidays in March 2025: అలర్ట్..మార్చిలో సగం రోజులు బ్యాంకులకు సెలవులు.. లిస్ట్ ఇదే
Bank Holidays In March 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI)2025 మార్చి నెలకు సంబంధించి బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల( Bank Holidays in March 2025) చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: Bank Holidays In March 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI)2025 మార్చి నెలకు సంబంధించి బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల( Bank Holidays in March 2025) చేసింది. ఆర్బిఐ ( RBI)తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని పలు బ్యాంకులకు (Bank Holidays in March 2025)10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, ఇంకొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. బ్యాంకు వినియోగదారులు ఈ సెలవులను ద్రుష్టిలో ఉంచుకుని..తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం బెటర్.
2025 మార్చి నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే (Bank Holidays in March 2025):
మార్చి 5 (బుధవారం) : పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా ఒడిశా, పంజాబ్, సిక్కిం రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మార్చి 7 (శుక్రవారం) : చాప్చర్ కుట్ పండుగ సందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మార్చి 8 (శనివారం) : రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మార్చి 14 (శుక్రవారం) : హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు. ఈ రోజు మణిపుర్‌లో యావోసాంగ్, బంగాల్‌లో డోల్‌జాత్రా పండుగలు ఉండటంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మార్చి 22 (శనివారం) : బిహార్ డే సందర్భంగా బిహార్‌లోని బ్యాంకులకు సెలవు ఉంది.
మార్చి 23 (ఆదివారం) : భగత్‌సింగ్ వర్థంతి, సహీద్ దివస్ కూడా ఈ రోజే ఉండటంతో బ్యాంకులకు సెలవు.
మార్చి 25 (మంగళవారం) : డోల్ జాత్రా సందర్భంగా అసోం, బంగాల్, జమ్మూకశ్మీర్, దిల్లీలో; ధులండి సందర్భంగా రాజస్థాన్‌లోని బ్యాంకులకు సెలవు.
మార్చి 28 (శుక్రవారం) : జమాత్-ఉల్-విదా సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లో, షబ్-ఎ-ఖద్ర్ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని బ్యాంకులకు సెలవు.
మార్చి 30 (ఆదివారం) : ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ఉగాది జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడ్వా చేసుకుంటారు.
మార్చి 31 (సోమవారం) : ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
మార్చినెలలో దాదాపు 10 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొసాగనున్నాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలాగానే నడుస్తాయి. కాబట్టి బ్యాంకులకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.






