ఈ నెలలో 18 రోజులు బ్యాంకులకు సెలవులు

by Naga Rani Yarlagadda |

డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరగడంతో బ్యాంకులకు వెళ్లే ఖాతాదారుల సంఖ్య తగ్గింది.

ఈ నెలలో 18 రోజులు బ్యాంకులకు సెలవులు
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరగడంతో బ్యాంకులకు వెళ్లే ఖాతాదారుల సంఖ్య తగ్గింది. డిపాజిట్లు, లోన్లు, పెద్దమొత్తంలో డబ్బు విత్ డ్రా, గోల్డ్ లోన్ల కోసం తప్పనిసరిగా వెళ్తున్నారు. కాగా.. ప్రతినెలా బ్యాంకులు రెండో, నాల్గవ శనివారాలు, నాలుగు ఆదివారాలు పనిచేయవన్న విషయం తెలిసిందే. ఇవి కాకుండా ఇతరత్రా పండుగలకు సెలవులుంటాయి. డిసెంబర్ లోనూ బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు వచ్చాయి. ఆర్బీఐ బ్యాంక్స్ హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం డిసెంబరులో మొత్తం 18 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

డిసెంబర్ 7, 14, 21, 28 తేదీలు ఆదివారాలు కూడా.. 13న రెండో శనివారం 27న నాల్గవ శనివారం బ్యాంకులకు సెలవు. ఇవి కాకుండా నేడు (డిసెంబర్ 1) రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇటీనగర్, కోహిమాలలో బ్యాంకులకు సెలవు.

ఈ తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు

డిసెంబర్ 3 - బుధవారం - ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ - పనాజీ

డిసెంబర్ 12 - శుక్రవారం - పా టోగాన్ నెంగ్మింజా సంగ్మా వర్థంతి - షిల్లాంగ్

డిసెంబర్ 18 - గురువారం - ఉ సోసో థామ్ వర్థంతి - షిల్లాంగ్

డిసెంబర్ 19 - శుక్రవారం - గోవా విమోచన దినోత్సవం - పనాజీ

డిసెంబర్ 20 - శనివారం - లోసూంగ్/ నంసూంగ్ పండుగ - గ్యాంగ్ టక్

డిసెంబర్ 22 - సోమవారం - లోసూంగ్/ నంసూంగ్ పండుగ - గ్యాంగ్ టక్

డిసెంబర్ 24 - బుధవారం - క్రిస్మస్ సెలబ్రేషన్స్ - ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్

డిసెంబర్ 25 - గురువారం - క్రిస్మస్ - దేశవ్యాప్తంగా సెలవు

డిసెంబర్ 26 - శుక్రవారం - క్రిస్మస్ స్పెషల్ సెలబ్రేషన్స్ - ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్

డిసెంబర్ 30 - మంగళవారం - ఉ కియాంగ్ నంగ్బా వర్థంతి - షిల్లాంగ్

డిసెంబర్ 31 - బుధవారం - న్యూ ఇయర్ స్పెషల్ సెలబ్రేషన్స్ - ఐజ్వాల్, ఇంఫాల్

Next Story