- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bajaj Group: 100 ఏళ్ల బజాజ్ గ్రూప్
ముంబైలో జరిగిన శతాబ్ది వేడుకలకు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రముఖ వ్యాపార సంస్థల్లో ఒకటైన బజాజ్ గ్రూప్ సోమవారంతో తన 100 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఆటోమొబైల్, ఫైనాన్స్, కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్, ఇంజనీరింగ్ వంటి పలు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ గ్రూప్ ప్రస్తుతం 148 బిలియన్ డాలర్ల(రూ. 14.19 లక్షల కోట్ల) మార్కెట్ విలువతో అతిపెద్ద సంస్థగా ఉంది. ముంబైలో జరిగిన శతాబ్ది వేడుకలకు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బజాజ్ గ్రూప్ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్ధికి బజాజ్ చేసిన కృషి ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు. కాగా, 1926లో స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ ఈ సంస్థను స్థాపించారు. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడైన జమ్నాలాల్ బజాజ్, వ్యాపారంతో పాటు సామాజిక సంస్కరణలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించడం, బాల్య వివాహాలు, వరకట్నం వంటి ఆచారాల నిర్మూలనకు పోరాడారు. ప్రస్తుతం బజాజ్ గ్రూప్‌లో 1.3 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 100కి పైగా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. బజాజ్ ప్రయాణం కేవలం వ్యాపార వృద్ధి కాదు, విశ్వాసాన్ని సంపాదించిన కథ అని రాజీవ్ బజాజ్ అన్నారు.






