- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బజాజ్ CNG బైక్ పై భారీ డిస్కౌంట్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
మార్కెట్లో ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ అలాగే CNG వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు

దిశ, వెబ్ డెస్క్ : మార్కెట్లో ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ అలాగే CNG వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు తక్కువ ధరలో వాహనాలను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన తొలి CNG బైక్... ఫ్రీడమ్ 125 కి (Bajaj Freedom 125 CNG ) మార్కెట్ లో విపరీతంగా క్రేజ్ పెరిగింది. అయితే దీనికి తగ్గట్టుగానే... భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ.
ఈ సీఎన్జీ ఫ్రీడమ్ 125 బైక్ పైన.. 5 వేల డిస్కౌంట్ ప్రకటించారు. ఈ బైక్ రిలీజ్ చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో... లెవెల్ NG 04 డ్రం వేరియంట్ పైన ఐదు వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఈ బైక్.. ఎక్స్ షోరూం ధర రూ.85,976కు తగ్గింది. ఈ ధర వివిధ నగరాల్లో.. మారుతూ ఉంటుంది.
ఈ ఫ్రీడమ్ 125 CNG బైక్ లో 3 పేరెంట్స్ ఉంటాయి. కానీ కేవలం NG 04 డ్రమ్ వేరియెంట్ పైన మాత్రమే డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంది. NG 04 డ్రమ్ ఎల్ ఈ డి బైక్ ధర 95,981 రూపాయలుగా ఫిక్స్ చేశారు. అలాగే NG 04 డిస్క్ ఎల్ఈడి ధర 1.11 లక్షలు గా ఉంది. ఇందులో బేస్ వేరియంట్ గ్రే అలాగే నలుపు రంగులో మాత్రమే లభిస్తాయి. మిగిలిన రెండు వేరియెంట్లు మాత్రం ఐదు కలర్స్ లో లభిస్తున్నాయి.






