- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bajaj Finance: పండుగ సీజన్‌కు రుణాలివ్వడంలో బజాజ్ ఫైనాన్స్ రికార్డులు
జీఎస్టీ 2.0, వ్యక్తిగత ఆదాయపు పన్ను ప్రయోజనాలు రుణాల విషయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ఈ ఏడాది పండుగ సీజన్ సమయంలో రికార్డు స్థాయిలో రుణాలను జారీ చేసినట్టు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 27 శాతం ఎక్కువ లోన్లు, విలువ పరంగా 29 శాతం అధికం మొత్తం ఇచ్చామని మంగళవారం ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ 2.0 సంస్కరణలు, వ్యక్తిగత ఆదాయపు పన్ను ప్రయోజనాల కారణంగా రుణాల విషయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని బజాజ్ ఫైనాన్స్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా దేశ ఆర్థిక వృద్ధికి ఊతం లభించింది. బజాజ్ ఫైనాన్స్ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 26 మధ్య సుమారు 63 లక్షల రుణాలను పంపిణీ చేసింది. ఇదే సమయంలో 23 లక్షల మంది కొత్త కస్టమర్లను సాధించిందని, వారిలో 52 శాతం మంది కొత్తగా రుణాలు కూడా పొందారని కంపెనీ వివరించింది. దీనివల్ల ఎక్కువమందికి ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా రోజువరీ వస్తువులు, ఉత్పత్తులపై పన్నులు తగ్గించడం వల్ల మధ్య, తక్కువ ఆదాయ కుటుంబాలు ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ ఖర్చు చేయడానికి ముందుకొచ్చాయని బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ సంజీవ్ బజాజ్ అన్నారు. ఈ పండుగ సీజన్‌లో సగం మందికి పైగా కస్టమర్లు కొత్తగా క్రెడిట్ పొందారని, వారంతా మొదటి రుణాన్ని తీసుకున్న వారేనని సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు.






