- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EV Scooter: పాత రోజులు గుర్తొస్తున్నాయి మావా.. ఈ ఈవీ చెతక్ వేసుకొని అలా లైఫ్ పార్టనర్ తో వెళ్తే..
EV Scooter: మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా.

దిశ్, వెబ్ డెస్క్ : EV Scooter: మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. అయితే మీరు బజాజ్ చెతక్ గురించి తెలుసుకోవడం బెటర్. బజాజ్ చెతక్ ధర,వేరియంట్లతో పాటు ఇతర వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో 2.6లక్షల చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. కొత్త ఈ స్కూటర్ కొనాలనుకునేవారికి ఈ మోడల్ మంచి ఆప్షన్ అవుతోంది. ఈ నేపథ్యంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర,ఫీచర్లతోపాటు ఇతర వివరాలు తెలుసుకుందాం
బజాజ్ చేతక్ సక్సెస్ కు ఉన్న కారణాల్లో ఒకటి దాని డిజైన్ రెట్రో ఫీల్ తోపాటు మోడర్న్ లుక్ ను ఇచ్చే విధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఈ స్కూటర్ కు ప్రీమియం ఫీల్ ను ఇచ్చే స్టైలిష్ ఆప్షన్ గా పరిగణించవచ్చు. పిస్తా గ్రీన్, హెజిల్ నట్, ఇండియో మెటాలిక్, బ్రూక్లిన్ బ్లాక్, మాట్ స్కార్లెట్ రెడ్ వంటి కలర్ ఆప్షన్స్ లో ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉండనుంది.
ఇందులో సీబీఎస్ ఉంటుంది. రెండు బ్రేక్స్ ఒకేసారి వేసినప్పుడు బ్రేకింగ్ స్టెబులిటీని ఇస్తుంది. సిటీరైడ్ కు బాగా ఉపయోగపడుతుంది. చేతక్ సస్పెన్షన్ కూడా బాగుంటుంది. బంప్స్ ను బాగా అబ్సర్బ్ చేస్తుంది. రైడ్ క్వాలిటీ బాగుంటుంది. బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ లో 6 వేరియంట్స్ ఉన్నాయి.
చేతక్ 2903: ఈ ఈవీలో 2.88 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండగా..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కి.మీ రేంజ్ వరకు ఇస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 63కేఎంపీహెచ్. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.1లక్షలు ఉంది.
చేతక్ 2903 టెక్‌ప్యాక్: ఈ చేతక్ 2903లో ఉన్న బ్యాటరీ ప్యాక్ ఉండగా..రేంజ్ కూడా ఒకటే. ఈ మోల్‌లో కంఫర్ట్‌ని పెంచే విధంగా అదనపు ఫీచర్లు వస్తాయి. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1.14లక్షలుగా ఉంది.
చేతక్ 3502: ఈ బైకులో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బైక్ రేంజ్ 153 కి.మీలు. 3502 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.3లక్షలు ఉంటుంది.
చేతక్ 3502 టెక్‌ప్యాక్: ఈ చేతక్ 3502లో ఉన్న బ్యాటరీ ప్యాక్ ఉంది. రేంజ్ 153 కి.మీలు ఇస్తుంది. కానీ దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1.35లక్షలు. అధిక ప్రైజ్‌లో క్లాక్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలారం ఫీచర్లు వస్తాయి.
చేతక్ 3501: ఈ బైకులో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని రేంజ్ 153 కి.మీ. టాప్ స్పీడ్ 73 కేఎంపీహెచ్. అదనంగా కంఫర్ట్ ఫీచర్స్ ఉండటం కారణంగా దీని ఎక్స్ షోరూం ధర రూ. 1.42లక్షలు.
బజాజ్ చేతక్ 3501 టెక్‌ప్యాక్: ఇందులో చేతక్ 3501కి సమానమైన బ్యాటరీ, రేంజ్ ఉంటాయి. అదనపు ఫీచర్లు ఉండటంతో దీని ధర రూ. 1.47లక్షలు.
ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి గట్టిపోటీ:
బెస్ట్ సెల్లింగ్ టీవీఎస్ ఐక్యూబ్‌కి బజాజ్ ఎలక్ట్రిక్ పోటీని ఇస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో 2.73లక్షల ఐక్యూబ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. బజాజ్ చేతక్‌కి చెందిన 2.6లక్షల యూనిట్ల సేల్స్ జరిగాయి.






