- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bajaj Auto: ఈ-రిక్షా విభాగంలోకి అడుగుపెట్టనున్న బజాజ్ ఆటో

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఈ ఏడాదిలో ఈ-రిక్షా సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అసంఘటిత రంగం అయినప్పటికీ, అత్యంత వేగంగా పెరుగుతున్న విభాగంలో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి చెప్పారు. వచ్చే నెలాఖరులోపు ఈ-రిక్ష కోసం అవసరమైన రెగ్యులేటరీ క్లియరెన్స్‌లను తీసుకుంటామని, నెలకు 45,000 వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవతరం ముగిసేలోగా 'ఈ-రిక్' పేరుతో కొత్త వాహనాలు తీసుకొస్తామని, రిక్షా సెగ్మెంట్‌లో పూర్తిగా కొత్త ట్రెండ్‌ను ఇది సెట్ చేస్తుందని, కొనుగోలుదారులతో పాటు ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని కంపెనీ వివరించింది. ఏప్రిల్ మొదటివారంలో వాహనాన్ని విడుదల చేయాలని భావిస్తున్నామని రాకేష్ శర్మ పేర్కొన్నారు. ఈ-రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా సరికొత్త వ్యాపారాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాము. కాగా, గతేడాది ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విభాగంలో 6,32,634 వాహనాల అమ్మకాలు జరిగాయి. ఇది ఇప్పటివరకు రికార్డు స్థాయి సేల్స్, గతేడాది కంటే 57 శాతం అధికం. వాహన్ డేటా ప్రకారం (ఫిబ్రవరి 6, 2025 నాటికి), ఈ విభాగంలో మొత్తం 424 కంపెనీలు ఉన్నాయి. అయితే, వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా, అతుల్ ఆటో, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీలే ప్రధాన వాటా కలిగి ఉన్నాయి.