ఐపీఎల్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇకపై జియో సినిమాలో నో ఫ్రీ మ్యాచ్.. ఎందుకంటే?

by Yella Dhawani Reddy |

రిలయన్స్‌కు చెందిన జియో సినిమా (Jio Cinema).. డిస్నీ+హాట్ స్టార్ (Disney+Hot Star)లు ఒక్కటయ్యాయి.

ఐపీఎల్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇకపై జియో సినిమాలో నో ఫ్రీ మ్యాచ్.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: రిలయన్స్‌కు చెందిన జియో సినిమా (Jio Cinema).. డిస్నీ+హాట్ స్టార్ (Disney+Hot Star)లు ఒక్కటయ్యాయి. దీంతో జియో హాట్‌స్టార్‌ (JioHotstar) సేవలు అందుబాటులోకి వచ్చాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చిన జియో హాట్ స్టార్.. ఐపీఎల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇకపై జియో హాట్‌స్టార్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లు ఫ్రీగా చూడటం కుదరదు. అంటే మ్యాచ్ చూడాలంటే కచ్చితంగా సబ్‌స్ర్కిప్షన్ తీసుకోవాల్సిందే.

జియో సినిమా 2023లో ఐదేళ్ల కాలానికి టీ20 టోర్నమెంట్ డిజిటల్ రైట్స్‌ని సొంతం చేసుకుంది. అయితే, 2024లో రిలయన్స్, వాల్ట్ డిస్నీ సంస్థలు కలిసిపోయి 8.5 బిలియన్ డాలర్ల భారీ డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో పాలసీలు కూడా మారిపోయాయి. అయితే, జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ మ్యాచ్ మొదట్లో కొన్ని నిమిషాలు మాత్రమే ఫ్రీగా చూసే అవకాశం ఇవ్వనున్నారు.

జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వివరాలు..

యాడ్-సపోర్టెడ్ మొబైల్ ప్లాన్ ధర మూడు నెలలకు గానూ రూ.149గా ఏడాదికి రూ.499గా ధర నిర్ణయించారు. ఇక రెండు డివైజ్‌లకు సపోర్ట్‌ చేసే సూపర్ ప్లాన్ ధర మూడు నెలల వ్యాలిడిటీకి రూ.299గా, ఏడాది వ్యాలిడిటీ అయితే రూ.899 గా ఉంది. ప్రకటనలు లేకుండా ప్రీమియం ప్లాన్‌కు నెలకు రూ.299తో ప్రారంభమవుతుంది. మూడు నెలల ప్రీమియం ప్లాన్‌ ధర రూ.499, ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ రూ.1499గా నిర్ణయించారు. ఈ ప్రీమియం ప్లాన్లతో నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను వీక్షించొచ్చు.

ప్రస్తుతం హాట్‌స్టార్‌ యాప్‌ను వినియోగిస్తుంటే.. యాప్‌ అప్‌డేట్ తర్వాత అది జియో హాట్‌స్టార్‌గా మారుతుంది. అలాగే, జియో సినిమా యాప్‌కు వెళితే అక్కడి నుంచి జియో హాట్‌స్టార్‌ యాప్‌కు రీడైరెక్ట్‌ అవుతుంది. ఒకవేళ ఇప్పటికే హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఉంటే రాబోయే 3 నెలల పాటు వారికి పాత రేట్లే కొనసాగుతాయి. ఒకవేళ జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఉంటే వారు ఆటోమేటిక్‌గా జియోహాట్‌స్టా్‌ర్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌కు మారుతారు.

Next Story