- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Axis Bank: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంక్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొన్ని కాలపరిమితులపై తన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. రూ. 3 కోట్ల వరకు డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లు వర్తించనుండగా, సవరించిన ఎఫ్‌డీ రేట్లు సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. 7 రోజుల నుంచి 10 ఏళ్ల మధ్య కాలవ్యవధులపై సాధారణ ఖాతాదారులకు 3-7.25 శాతం మధ్య వడ్డీని బ్యాంకు అందిస్తుంది. ఇదే కాలపరిమితిలో సీనియర్ సిటిజన్‌లకు 3.5 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీని ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా 15 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య ఎఫ్‌డీలకు అత్యధికంగా 7.25 శాతం వడ్డీని బ్యాంకు అమలు చేస్తోంది. మిగిలిన వాటిలో 61 రోజుల నుంచి 3 నెలలకు 4.50 శాతం, 6 నెలలకు 4.75 శాతం, 9 నెలలకు 5.75 శాతం, ఏడాది కాలవ్యవధిపై 6 శాతం, 2-5 ఏళ్లకు 7.10 శాతం,5-10 ఏళ్లకు 7 శాతం వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తోంది.