Aviva India: బ్రిటీష్ బీమా కంపెనీకి రూ. 65.3 కోట్లు డిమాండ్ నోటీసులిచ్చిన పన్ను అధికారులు

by S Gopi |
Aviva India: బ్రిటీష్ బీమా కంపెనీకి రూ. 65.3 కోట్లు డిమాండ్ నోటీసులిచ్చిన పన్ను అధికారులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అక్రమ కమీషన్లు చెల్లించేందుకు నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి, తప్పుడు పన్ను క్రెడిట్‌లను క్లెయిమ్ చేసినట్లు దర్యాప్తులో తేలిన కారణంగా బ్రిటీష్ బీమా సంస్థ అవివా భారత విభాగానికి 7.5 మిలియన్ డాలర్లు(రూ. 65.3 కోట్ల) పన్నులు, పెనాల్టీల రూపంలో చెల్లించాలని దేశీయ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భారత మార్కెట్లో తన వ్యాపారాన్ని పెంచేందుకు అవివా ఇండియా 2017-2023 మధ్యకాలంలో మార్కెటింగ్ సేవల కోసం రూ. 225 కోట్లను మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించింది. అయితే, ఆ ఆ నిధులను బీమా నియంత్రణా నిబంధనలకు విరుద్ధంగా అవివా ఏజెంట్లకు కమీషన్ల రూపంలో ఇచ్చినట్టు తేలింది. దీనికి సంబంధించి భారత పన్ను అధికారులు గతేడాదిలోనే కంపెనీకి నోటీసులు జారీ చేశారు. నకిలీ ఇన్‌వాయిస్‌లు, నగదు చెల్లింపుల ద్వారా పన్ను క్రెడిట్‌లను తప్పుగా క్లెయిమ్ చేసి రూ. 45 కోట్ల పన్నులను ఎగవేసినట్లు అధికారులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అవీవా కంపెనీ వాదనలు విన్న తర్వాత జాయింట్ ట్యాక్స్ కమీషనర్ ఆదిత్య సింగ్ యాదవ్.. కంపెనీ పన్నుల ఎగవేసిన రూ. 32.9 కోట్లకు 100 శాతం జరిమానా కలిపి రూ. 65.3 కోట్లను చెల్లించాలని పేర్కొన్నారు

Advertisement
Next Story