Indigo: ఇండిగోపై రూ. 20 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

by S Gopi |

ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ ఎక్స్ఛేంజీ బీఎస్ఈకి తెలియజేసింది.

Indigo: ఇండిగోపై రూ. 20 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జరిమానా విధించింది. ఉదయపూర్ విమానాశ్రయంలో ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ ప్రొసీజర్‌కు సంబంధించి ఉల్లంఘనకు గాను ఇండిగోపై రూ. 20 లక్షల జరిమానా కట్టాలని పేర్కొంది. ఈ సమాచారాన్ని ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ ఎక్స్ఛేంజీ బీఎస్ఈకి తెలియజేసింది. నిబంధనల ప్రకారం, విమానాశ్రయాల్లో స్టాండర్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్ డిపార్చర్, ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ ప్రొసీజర్‌ను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే అమలు చేయాలి. కానీ, ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో ఇండిగో సొంతంగానే రూపొందించి అమలు చేసినట్టుగా డీజీసీఏ గుర్తించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, అందుకే జరిమానా విధించినట్టు డీజీసీఏ పేర్కొందని ఇండియో వివరించింది. దీనివల్ల ఇండిగో ఆర్థిక, సాధారణ లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం లేదని స్పష్టం చేసింది.

Next Story