- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Office Space: తొలిసారి ఢిల్లీ, బెంగళూరులో రూ. 100 మార్కు చేరిన ఆఫీస్ అద్దె
బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సగటు ఆఫీస్ అద్దెలు తొలిసారిగా చదరపు అడుగుకు రూ.100 మార్కును దాటాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ తాజా డేటా ప్రకారం, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సగటు ఆఫీస్ అద్దెలు తొలిసారిగా చదరపు అడుగుకు రూ.100 మార్కును దాటాయి. ముంబై ఇప్పటికే ఈ మార్కును దాటేసింది. చాలా కంపెనీలు తిరిగి ఆఫీసులను అద్దెకు తీసుకోవడం, పెద్ద కార్పొరేట్ సంస్థలు విస్తరణపై దృష్టి పెట్టడం వల్ల ప్రైమ్ లొకేషన్లలో స్పేస్ కోసం గిరాకీ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అద్దెలు 2-15 శాతం వరకు పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్, కోల్‌కతాలో గరిష్టంగా 15 శాతం వృద్ధి నమోదవగా, ముంబైలో అద్దె 6 శాతం పెరిగి రూ.125కు చేరింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 15 శాతం వృద్ధితో చ.అ.కు రూ. 105, బెంగళూరులో రూ.100.6(7 శాతం వృద్ధి), పుణెలో రూ.80.9(5 శాతం)గా నమోదైంది. హైదరాబాద్, చెన్నై కూడా 8 శాతం చొప్పున పెరిగి వరుసగా రూ.77.5, రూ.74.5 వద్ద నిలిచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆఫీస్ మార్కెట్ కొత్త గరిష్ఠాలకు చేరిందని నివేదిక అభిప్రాయపడింది. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో అద్దెలను ఇంకా పెంచే అవకాశం ఉందని పేర్కొంది.






