- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FADA: ఏప్రిల్‌లో 3 శాతం పెరిగిన వాహన రిటైల్ అమ్మకాలు
ఏప్రిల్ నెలలో వాహన రిటైల్ అమ్మకాలు 2.95 శాతం పెరిగి 22,87, 952 యూనిట్లకు చేరుకున్నాయని ఫాడా వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కారణంగా వాహన పరిశ్రమలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వాహన రిటైల్ అమ్మకాలు 2.95 శాతం పెరిగి 22,87, 952 యూనిట్లకు చేరుకున్నాయని డీలర్స్ అసోసియేషన్ ఫాడా సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా అక్షయ తృతీయ, బెంగాల్ కొత్త సంవత్సరం, వైశాఖి, విషు, చైత్ర నవరాత్రి వంటి పండుగలకు కస్టమర్లు కొత్త వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపడంతో అమ్మకాలు పెరిగాయని ఫాడా తెలిపింది. గతేడాది ఇదే నెలలో రిటైల్ అమ్మకాలు 22,22,463 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తం అమ్మకాల్లో కమర్షియల్ వాహనాలు మినహా అన్నీ వృద్ధిని చూశాయి. టూ-వీలర్ విక్రయాలు 2.25 శాతం, త్రీ-వీలర్ 24.5 శాతం, ప్యాసింజర్ వాహనాలు 1.5 శాతం, ట్రాక్టర్లు 7.5 శాతం ఎక్కువ అమ్మకాలను సాధించాయి. కమర్షియల్ వాహనాలు మాత్రం 1 శాతం మేర క్షీణించాయని ఫాడా వెల్లడించింది. అంతర్జాతీయంగా టారిఫ్ యుద్ధానికి బ్రేక్ పడటం, స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం, పెట్టుబడిదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉండటం వంటి పరిణామాలు వినియోగదారులు ఖర్చు చేసేందుకు దోహదపడ్డాయని ఫాడా అధ్యక్షుడు సీ ఎస్ విఘ్నేశ్వర్ చెపపారు. ముఖ్యంగా టూ-వీలర్ వాహనాల అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, వ్యవసాయ రంగంలో దిగుబడి పెరగడం, అనుకూల రుతుపవనాల సంకేతాలు ఈ విభాగంలో అమ్మకాలకు కారణమని ఆయన పేర్కొన్నారు.






