ద్విచక్ర వాహనాలపై GST తగ్గించాలని కోరిన ఆటోమొబైల్ డీలర్ల సంఘం!

by Disha Web Desk 17 |
ద్విచక్ర వాహనాలపై GST తగ్గించాలని కోరిన ఆటోమొబైల్ డీలర్ల సంఘం!
X

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ డీలర్ల సంఘం ఫాడా గురువారం ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేసే ఈ విభాగాన్ని లగ్జరీగా పరిగణించవద్దని అభ్యర్థించింది. ఈ మేరకు ఫాడా ఆర్థిక మంత్రితో పాటు జీఎస్టీ కౌన్సిల్ ఛైర్మన్, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, ఆటోమొబైల్ రంగాన్ని పర్యవేక్షించే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది.

నిర్ణయాత్మక జోక్యం ద్వారా ద్విచక్ర వాహనాలను మరింత సరసమైనదిగా చేస్తూ డిమాండ్‌ను పునరుద్ధరించడం ద్వారా గత కొన్నేళ్లుగా దెబ్బతిన్న పరిశ్రమకు మద్దతు లభిస్తుందని ఫాడా ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ద్విచక్ర వాహన పరిశ్రమ క్లిష్ట దశలో ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కఠిన ఉద్గార నిబంధనలు, కరోనా ప్రభావం వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో టూ-వీలర్లపై జీఎస్టీ రేటు తగ్గించడం సరైన సమయమని, దానివల్ల సామాన్యులకు అందుబాటులో ద్విచక్ర వాహనాలు ఉంటాయని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా పేర్కొన్నారు.


Next Story

Most Viewed