- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Auto OEM: వాహనాల లాంచ్‌లో భారీ జాప్యం
గత ఐదేళ్లలో 93 శాతం కంపెనీలు డిజిటల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ టూల్స్‌పై రూ.50 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆటోమొబైల్ కంపెనీలు కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దేశీయంగా కొత్త వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురావడంలో గతంలో ఎక్కువ కంటే ఎక్కువ జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. వెక్టర్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, దేశీయ ఆటో ఓఈఎంలు కొత్త మోడళ్లను విడుదల చేయడంలో సగటున 9 నుంచి 15 నెలలు ఆలస్యం చేస్తున్నాయి. గత ఐదేళ్లలో 93 శాతం కంపెనీలు డిజిటల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ టూల్స్‌పై రూ.50 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ అధ్యయనం ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలకు చెందిన 57 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా రూపొందింది. దీని ప్రకారం, వాహనం తయారీ దశలో కనిపించే సమస్యలు వాస్తవానికి డిజైన్ దశలోనే మొదలవుతాయి. అమరిక, తయారీ, సర్వీసింగ్‌కు సంబంధించిన లోపాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే గంటల్లో పరిష్కరించవచ్చు. కానీ అవే సమస్యలు తయారీ దశకు చేరేసరికి నెలల జాప్యం, భారీ వ్యయానికి దారితీస్తున్నాయని ఎగ్జిక్యూటివ్‌లు వివరిస్తున్నారు. కొత్త వాహనాల అభివృద్ధి వేగాన్ని పెంచాలంటే ఒకేసారి చేపట్టే ప్రాజెక్టుల సంఖ్యను నియంత్రించడం, నిపుణుల సమయాన్ని సమర్థంగా వినియోగించడం, డిజిటల్ డిజైన్ వెరిఫికేషన్‌ను మరింత బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది.






