ఆగస్టు-6: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

by Hamsa |
ఆగస్టు-6: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
X

దిశ, ఫీచర్స్: మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా అన్నింటిలో ఎక్కువగా వారికి పసిడిపై మక్కువ ఎక్కువగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కొనుగోలు దారులు ఎప్పుడు తగ్గితే అప్పుడే కొనుగోలు చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో.. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే బంగారం ధరలు నేడు భారీగా తగ్గి పసిడి ప్రియులకు శుభవార్త అందించాయి. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో బంగారం రేట్లు దిగొస్తున్నాయి. అయితే 22 క్యారెట్ల బంగారం రూ. 800 తగ్గగా రూ. 63, 900గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 870 తగ్గగా రూ. 69, 710కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండిపై రూ. 3200 తగ్గడంతో రూ. 82, 500గా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.63, 900

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 69, 710

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.63, 900

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 69, 710



Next Story

Most Viewed