ఆగస్టు-1: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గిన Gas Cylinder Price

by Chukka Sudharani |   (  Updated:2023-08-01 02:27:25  IST  )

ఒకటో తేదీ వచ్చిందంటే చాలు. సామాన్య ప్రజలు గంపెడు ఆశలతో ఎదురు చూస్తుంటారు.

ఆగస్టు-1: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గిన Gas Cylinder Price
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకటో తేదీ వచ్చిందంటే చాలు. సామాన్య ప్రజలు గంపెడు ఆశలతో ఎదురు చూస్తుంటారు. ప్రతి నెల ఒకటో తేదీన నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలు సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపాయి. ఈ రోజు ఒకటో తేదీ కావడంతో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాయి.

అయితే.. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలను మాత్రమే తగ్గించాయి. ఈ మేరకు సిలిండర్ ధర రూ. 100 మేర తగ్గించి కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. గృహ వినియోగానికి ఉపయోగించే LPG సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

స్థిరంగా కొనసాగుతున్న 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూరు: రూ. 1,114

ఇవి కూడా చదవండి : నేడు స్వల్పంగా తగ్గిన Gold Price

Next Story