- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AU SFB: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్లుగా రణ్‌బీర్, రష్మిక
ప్రాధాన్యత కలిగిన జాతీయ బ్యాంకింగ్ బ్రాండ్‌ను నిర్మించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల యూనివర్సల్ బ్యాంకుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నుంచి ప్రాథమిక ఆమోదం పొందిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సినీ నటులు రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నలను బ్యాంకు బ్రాండ్ అంబాషిడర్లుగా నియమించినట్టు సోమవారం ప్రకటనలో తెలిపింది. పట్టణ, మెట్రో సహా దేశవ్యాప్తంగా మార్కెట్లలో మరిన చొచ్చుకుపోయి, ప్రాధాన్యత కలిగిన జాతీయ బ్యాంకింగ్ బ్రాండ్‌ను నిర్మించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ అకౌంట్లు, కరెంట్ ఖాతాలలో మరింత ప్రాధాన్యతను పెంచడంపై దృష్టి సారించేందుకు ఈ సహకారం బలపరుస్తుందని బ్యాంకు తెలిపింది. యూనివర్సల్ బ్యాంకుగా ఎదిగేందుకు మేము సిద్ధమవుతున్నాం. బ్యాంకు అందించే ఆఫర్‌లను కస్టమర్లకు మరింత చేరువ చేయడానికి ఈ సమయం ఎంతో కీలకం. ఇందుకు రణ్‌బీర్, రష్మిక దేశంలోని వివిధ ప్రాంతాలతో, అనేక మార్గాల్లో లోతుగా కనెక్ట్ అవుతారని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ సంజయ్ అగర్వాల్ అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా బ్రాండ్ విలువను పెంచడం, కీలక మార్కెట్లలో విస్తరణకు వీలవుతుందని, బ్యాంకు తదుపరి దశ వృద్ధికి ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు.






