AU Small Finance Bank: ఎల్ఐసీతో జట్టుకట్టిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

by S Gopi |

ప్రజలందరికీ జీవిత బీమా అందించే లక్ష్యంలో భాగంగా దీన్ని ప్రారంభిస్తున్నట్టు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వెల్లడించింది.

AU Small Finance Bank: ఎల్ఐసీతో జట్టుకట్టిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బీమా సదుపాయాలను విస్తరించేందుకు ఎల్ఐసీతో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి చెందిన జీవిత బీమా ఉత్పత్తులను బ్యాంకు తన బ్రాంచులన్నిటిలో అందుబాటులో ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సేవలు లభిస్తాయని, ప్రజలందరికీ జీవిత బీమా అందించే లక్ష్యంలో భాగంగా దీన్ని ప్రారంభిస్తున్నట్టు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సోమవారం తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇరు సంస్థల మధ్య కుదురిన ఒప్పందం ప్రకారం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎల్ఐసీ ఉత్పత్తులను బ్రాంచులలో అందిస్తుంది. వాటిలో టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ ప్లాన్‌లు, హోల్ లైఫ్ పాలసీలు, పెన్షన్, యాన్యుటీ ఉత్పత్తులు, పిల్లలకు సంబంధించి ప్లాన్‌లు ఉన్నాయి. బ్యాంక్ వీటిని 21 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న తన 2,456కి పైగా బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల ద్వారా అందించనుంది. ఈ భాగస్వామ్యంతో ఇరు సంస్థలకూ ప్రయోజనాలు ఉన్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన బ్యాంకింగ్ సేవలతో పాటు ఇతర ఆర్థిక సేవలందించే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోనుంది. ఎల్ఐసీ బ్యాంకు సహకారంతో బీమా రంగంలో కస్టమర్ల పరిధిని పెంచుకోనుంది.

Next Story