- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ATM: ఏటీఎంల్లో నగదు కొరత
ఈ భారాన్ని తగ్గించుకునేందుకు తక్కువ రద్దీ ఉన్న ఏటీఎంలలో నగదు నింపే (రీఫిల్) పద్ధతిని మార్చాలని ఆలోచిస్తున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో త్వరలో నగదు కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిక ఇంధన ధరలు, సిబ్బంది వేతనాలు పెరగడంతో ఏటీఎం క్యాష్ మేనేజ్‌మెంట్ కంపెనీలు తమ నిర్వహణ వ్యయం 15-20 శాతం వరకు పెరిగిందని చెబుతున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు తక్కువ రద్దీ ఉన్న ఏటీఎంలలో నగదు నింపే (రీఫిల్) పద్ధతిని మార్చాలని, అంటే ప్రతిరోజూ కాకుండా వారానికి 2-3 సార్లు మాత్రమే నగదు నింపాలని ఈ సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఏటీఎం కార్యకలాపాలు ప్రధానంగా క్యాష్ వ్యాన్‌లపై ఆధారపడటంతో, 2026 మేలో ఇంధన ధరలు లీటరుకు సుమారు రూ. 7.50 పెరగడం ఈ రంగంపై ప్రభావం చూపింది. అదే సమయంలో భద్రతా సిబ్బంది, డ్రైవర్ల వేతనాలు పెరగడం వల్ల మెట్రో నగరాల్లో ఒక్కో ఏటీఎం రీఫిల్‌కు రూ. 800-1,500 ఖర్చవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ. 5,000కి పైగా చేరుతోంది. ఈ నేపథ్యంలో సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్, బ్రింక్స్ ఇండియా, ఎస్ఐఎస్ ప్రోసెగర్ వంటి సంస్థలు ఛార్జీల పెంపు కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో చర్చలు జరుపుతునట్లు సమాచారం. ఈ మార్పుల వల్ల, రద్దీ తక్కువగా ఉన్న ఏటీఎంలలో నగదు త్వరగా అయిపోవడం లేదా తరచూ ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు.






