- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను రూ. 3,000 వరకు పెంచిన ఏథర్ ఎనర్జీ
జనవరి 1 నుంచి అన్ని మోడళ్లపైనా రూ. 3,000 వరకు పెంపు నిర్ణయం అమలవుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల(ఈవీ) తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్ని మోడళ్లపైనా రూ. 3,000 వరకు పెంపు నిర్ణయం అమలవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈవీల తయారీకి సంబంధించి ముడిసరుకుల ఖర్చులు పెరగడంతో పాటు ఫారెక్స్ ప్రభావం, కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాల వ్యయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 450 సిరీస్ స్కూటర్లతో పాటు ఫ్యామిలీ స్కూటర్ రిట్జా ఉన్నాయి. వీటి ధరలు రూ. 1,14,946 నుంచి రూ. 1,82,946 వరకు ఉన్నాయి. ఇదే సమయంలో కంపెనీ డిసెంబర్ ఆఫర్ కింద ఎంపిక చేసిన నగరాల్లో రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పటికే కార్ల కంపెనీలు ధరల పెంపును ప్రకటించగా, త్వరలో టూవీలర్, ఇతర ఈవీ కంపెనీలు ధరలు పెంచుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది మే నెలలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఏథర్ ఎనర్జీ ఇప్పటికే ఇన్వెస్టర్లకు రెండంకెల రాబడిని ఇచ్చింది. ఈ 7 నెలల వ్యవధిలో కంపెనీ ఇష్యూర్ ధర నుంచి 118 శాతం పెరిగింది.






