X Subscription: పెరిగిన 'ఎక్స్' సబ్‌స్క్రిప్షన్ ధరలు

by S Gopi |

సబ్‌స్క్రిప్షన్ ధరలను రెట్టింపు పెంచడం ద్వారా కస్టమర్లకు ఎక్స్ షాక్ ఇచ్చింది.

X Subscription: పెరిగిన ఎక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచేసింది. ఇటీవలే ఎలన్ మస్క్ ఏఐ చాట్‌బాట్ ఎక్స్ఏఐ గ్రోక్3 సేవలను ప్రారంభించింది. ఈ మోడల్‌ను విడుదల చేసిన గంటల వ్యవధిలోనే ఎక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచడం గమనార్హం. సబ్‌స్క్రిప్షన్ ధరలను రెట్టింపు పెంచడం ద్వారా కస్టమర్లకు ఎక్స్ షాక్ ఇచ్చింది. సవరించిన ధరల ప్రకారం, ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 1,750 నుంచి ఏకంగా రూ. 3,470కి పెంచేసింది. వార్షిక ప్లాన్ ధరను కూడా రూ. 18,300 నుంచి రూ. 34,430కి పెంచేసింది. 2023, అక్టోబర్‌లో మొదటిసారిగా ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధరలను ఎపంచింది. ప్లాట్‌ఫామ్ ఆదాయం పెంచేందుకు రూ. 1,300 ఉన్న ధరను గతేడాది డిసెంబర్‌లో రూ. 1,750కి సవరించింది. తాజాగా దీన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయించడం గమనార్హం. కాగా, ఎక్స్ ప్రస్తుతం బేసి, ప్రీమియం, ప్రీమియం ప్లస్ వంటి మూడు ప్లాన్‌లను అందిస్తోంది. బెసిక్ ప్లాన్ ధర రూ. 244గా ఉంది. ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ. 650గా ఉంది. ఏఐ చాట్‌బాట్ గ్రోక్3 సేవలు పొందడానికి సబ్‌స్క్రైబర్లు తప్పనిసరిగా ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుందని ఎక్స్ స్పష్టం చేసింది.

Next Story