- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Debit card: డెబిట్ కార్డు వాడుతున్నారా? ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ లో డబ్బులు కట్ అవ్వడం ఖాయం
Debit card: ఏటీఎం కార్డు విషయంలో మనకు చాలా విషయాలు తెలియవు.

దిశ, వెడ్ డెస్క్: Debit card: ఏటీఎం కార్డు విషయంలో మనకు చాలా విషయాలు తెలియవు. దాన్ని ఎడాపెడా వాడేస్తూ ఉంటాము. మనకు డబ్బు అవసరమైనప్పుడల్లా ఏటీఎం సెంటర్ కు వెళ్లి డబ్బులు గీకేస్తూ ఉంటాము. అలాగే పిఓఎస్ మిషిన్లలో డెబిట్ కార్డులు పెట్టి షాపింగ్ కూడా చేసేస్తుంటాము. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు మనం నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల మీరు బ్యాంకులకు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అలాంటి ఒక ఛార్జెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అదే POSDEC Charges వీటిని సాధారణ పరిభాషలో Point Of Sale Decline Charges అని పిలుస్తుంటారు. కొన్నిసార్లు మీరు ఏటీఎం, డెబిట్ కార్డులు వాడేటప్పుడు ATM, swipe machine, online ట్రాన్సాక్షన్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. కొన్నిసార్లు ఈ తరహా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినప్పుడు బ్యాంకులు Point Of Sale Decline Charges విధిస్తుంటాయి.
అయితే మనం చూసుకోకుండా ఒకటికి రెండుసార్లు కార్డు డిక్లైన్ అయిన ప్రతిసారి ప్రయత్నించినప్పుడు మళ్ళీ Point Of Sale Decline Charges చార్జెస్ మీ అకౌంట్లో కట్ అవుతుంటాయి. ఇక్కడ వీడియోలో చూపెట్టిన విధంగా ఉదాహరణకు మీ అకౌంట్లో రెండు వేల రూపాయలు ఉన్నాయి అనుకుందాం. మీరు ఒక షాపుకు వెళ్లి షాపింగ్ చేసినా అనంతరం మీ డెబిట్ కార్డును పిఓఎస్ మిషిన్ లో పెట్టి బిల్లు కట్టినప్పుడు అందులో సరిపడా అమౌంట్ లేకపోతే మాత్రం మీ లావాదేవీ ఫెయిల్ అయిపోతుంది.
అప్పుడు మీరు మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండా ఒకటికి రెండుసార్లు అదే కార్డును పిఓఎస్ మిషిన్ లో ఎంట్రీ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం మళ్లీ Point Of Sale Decline Charges కింద డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ చార్జెస్ అనేవి ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటాయి. SBI, PNB, Bank of Baroda, Union Bank, Axis, ICICI ఇలా ఇది బ్యాంకును బట్టి ఈ చార్జెస్ మారుతూ ఉంటాయి.
కనుక మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకున్న తర్వాతే మీరు మిషన్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తినట్లయితే బ్యాంకు బ్రాంచిని వెళ్లి సంప్రదించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.






