Gold Investments: బంగారంలో పెట్టుబడి పెడితే ఎన్ని లాభాలో.. ఇది ఎలా మిస్ అయ్యాం భయ్యా!

by Vennela |

Gold Investments: స్టాక్ మార్కెట్లు(Stock Market) పతనమవుతున్నాయి

Gold Investments:  బంగారంలో పెట్టుబడి పెడితే ఎన్ని లాభాలో.. ఇది ఎలా మిస్ అయ్యాం భయ్యా!
X

దిశ, వెబ్ డెస్క్: Gold Investments: స్టాక్ మార్కెట్లు(Stock Market) పతనమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్(Gold Investments) చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకుని ఉండాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.

బంగారంలో ఇన్వెస్ట్(Gold Investments) చేసేవారికి ఎప్పుడూ లాభాలే ఉంటాయి. ఈసారి అయితే ఊహించని విధంగా బంగారం ధర పెరగడంతో ఇన్వెస్టర్ల పంట పండినట్లయ్యింది. ఈ ఫిబ్రవరి 12వ తేదీ నాటికి బంగారం ధర ఒక ఔన్స్ కు ఏకంగా 2,913 డాలర్లకు చేరుకుంది. భారత్ లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ లో 10 గ్రాముల బంగారం ధర(Gold rate) రూ. 85, 635 పలుకుతోంది. కేవలం 6 వారాల్లోనే డాలర్లలో చూస్తే 11.6శాతం పెరుగుదల అదే రూపాయాల్లో చూస్తే దాదాపు 13శాతం వరకు పెరుగుదల కనిపించింది. అందుకే స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్న పరిస్థితుల్లో చాలా మంది బంగారం పై ఇన్వెస్ట్(Gold Investments) చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది బంగారంలో పెట్టుబడి (Gold Investments)పెట్టాలంటే కొన్ని విషయాలపై తప్పకుండా ఫోకస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

గోల్డ్ బిజినెస్(Gold Business) అంతర్జాతీయంగా డాలర్లలోనే జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో భారత రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే బాగా తగ్గింది. దీంతో డాలర్లలో బంగారం ధర కాస్త పెరిగినా రూపాయల్లో మాత్రం దాని ధర మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు డాలర్లలో బంగారం ధర 11.6శాతం పెరిగితే రూపాయల్లో మాత్రం దాదాపు 13శాతం పెరిగింది. దీని వల్ల బంగారం నుంచి వచ్చే లాభాలు ఇండియాలో మరింత పెరిగుతాయి.

బంగరం ధర(Gold rate) పెరగడానికి ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఆర్థిక విధానాలే అని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్(America's financial system) ను పరుగులు పెట్టించేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వీటితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాత్రం అస్థిరత్వం షురూ అయ్యింది. పెట్టుబడిదారులకు ఆర్థికంగా అస్థిరత్వం ఏర్పడితే వెంటనే తమ డబ్బును బంగారంపై పెట్టుబడికి మళ్లిస్తారు. ఎందుకంటే బంగారం ఒక నమ్మకమైన పెట్టుబడిగా చాలా మంది నమ్ముతుంటారు. ఇలా అందరూ బంగారం కొనేందుకు ఎగబడటంతో డిమాండ్ తోపాటు దాని ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి.

చాలా మంది ఆర్థిక నిపుణులు ఇప్పుడు ఇన్వెస్ట్ మెంట్ పోర్ట్ ఫోలియో(Investment portfolio)లో గోల్డ్ కూడా చేర్చుకోమని సలహాఇస్తున్నారు. డబ్బు మొత్తాన్ని ఒకే రకమైన ఆస్తిలో పెట్టకూడదు. రకరకాల వాటిలో పెట్టుబడి పెడుతుండాలి. అయితే ఈ సలహా బంగారం ధరలు పెరుగుతున్నప్పుడే కాదు ఎప్పుడూ వర్తిస్తుంది. నిజానికి గత కొన్నేళ్లుగా స్టాక్ మార్కెట్లు బంగారంతో పోలిస్తే చాలా రాణించాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు పడిపోతుంటే..బంగారం ధరలు మాత్రం దూసుకుపోతున్నాయి.

ఇక మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా మారుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అందుకే ఎప్పుడూ రకరకాల పెట్టుబడులు స్టాక్స్,బంగారం, బాండ్లు ఇలా ఇతర ఆస్తులు ఉండేలా చూసుకోవడం మంచిది. ఇలా చేస్తే నష్టాలను తగ్గించుకోవచ్చు. స్థిరమైన లాభాలను పొందవచ్చు. బంగారం ఎప్పటి నుంచో విలువైనదిగా పేరు తెచ్చుకుంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత్వం(Economic crisis, political instability) లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా పెట్టుబడిదారులు గోల్డ్ వైపే చూస్తుంటారు. లిండీ ఎఫెక్ట్ అనే ఒక సిద్ధాంతం ఉంది. దీన్ని నాసిమ్ నికోలస్ టాలెబ్ అనే ఆర్థిక నిపుణులు పాపులర్ చేశారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఎంత ఎక్కువ కాలం ఉంటే అది భవిష్యత్తులో కూడా అంతే కాలం ఉండే ఛాన్స్ ఉంటుంది.

పసిడి శాతబ్దాలుగా వాడుకలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా దీని విలువ అలాగే ఉంటుందని నమ్మకం. కాగితం డబ్బులు రాకముందు కూడా ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో బంగారాన్ని కరెన్సీగా వాడుతుండేవారు. ఆ నమ్మకమే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే కష్టకాలంలో పెట్టుబడిదారులు బంగారాన్ని నమ్ముతుంటారు.

Next Story