Electric car: ఎలక్ట్రిక్ కార్ కొంటున్నారా.. ఈ 4 ప్రభుత్వ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేటుకే రుణం.. ఈ విషయం తెలిస్తే ఆనందంతో ఊగిపోతారు

by Vennela |   (  Updated:2025-05-15 06:31:34  IST  )

Electric car: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు బాగా గిరాకీ పెరిగింది పెరుగుతున్న పెట్రోల్ ధరలు డీజిల్ ధరలకు ఎలక్ట్రిక్ కార్లు మంచి పరిష్కారమని నిపుణులు పేర్కొంటున్నారు.

Electric car: ఎలక్ట్రిక్ కార్ కొంటున్నారా.. ఈ 4 ప్రభుత్వ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేటుకే రుణం.. ఈ విషయం తెలిస్తే ఆనందంతో ఊగిపోతారు
X

దిశ, వెబ్ డెస్క్: Electric car: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు బాగా గిరాకీ పెరిగింది పెరుగుతున్న పెట్రోల్ ధరలు డీజిల్ ధరలకు ఎలక్ట్రిక్ కార్లు మంచి పరిష్కారమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు పర్యావరణ ప్రేమికులు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మార్కెట్లో లభిస్తున్న పెట్రోల్ డీజిల్ కార్లతో పోల్చితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఒకసారి పెట్టుబడి పెడితే మీరు ఎక్కువ కాలం తక్కువ ఖర్చుతో లభించే విద్యుత్తు కరెంటు చార్జీతో ఈ కారును నడిపే అవకాశం ఉంటుంది తద్వారా మెయింటెనెన్స్ తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించేందుకు పలు ప్రభుత్వ బ్యాంకులో రుణాలను అందిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. SBI గ్రీన్ కార్ లోన్: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా రుణాలను అందిస్తోంది దీని పేరు ఎస్బిఐ గ్రీన్ కార్ లోన్, ఈ స్కీం కింద వడ్డీ రేటు 7.55% నుండి 8.25% మధ్యలో నిర్ణయించారు. మీ సివిల్ స్కోర్ ను బట్టి వడ్డీ రేటు మారుతుంది. వాహనం ఆన్-రోడ్ ధరలో 90% వరకు లోన్ లభిస్తుంది. లోన్ రిపేమెంట్ కాలం 3 నుండి 8 సంవత్సరా వరకూ ఎంపిక చేసుకోవచ్చు.

2. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహా సూపర్ గ్రీన్ కార్ లోన్ పేరిట ప్రత్యేక స్కీం తీసుకుని వచ్చింది. దీని కింద వడ్డీ రేటు సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల వడ్డీరేటు కన్నా 0.25% తగ్గింపుతో ఆఫర్ చేస్తున్నారు. అయితే వాహనం ఆన్-రోడ్ ధరలో 100% వరకు లభిస్తుంది. ఇక ఈ లోన్ ప్రత్యేకతల విషయానికి వచ్చినట్లయితే, ఈ లోన్ పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజలు లేవు. అలాగే ప్రీపేమెంట్, పార్ట్ పేమెంట్, ప్రీ-క్లోజర్ ఛార్జీలు లేవు

3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా గ్రీన్ కార్ లోన్స్ అందిస్తోంది. వడ్డీ రేటు విషయానికి వస్తే ప్రస్తుత డీజిల్, పెట్రోల్ కార్ లోన్ రేట్లతో పోలిస్తే తక్కువగా ఉంది.

4. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: మరో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్ గో గ్రీన్ వెహికల్ స్కీం ప్రవేశ పెట్టింది. దీని వడ్డీ రేటు కూడా ప్రస్తుత కార్ లోన్ రేట్లతో పోలిస్తే తక్కువగా ఉంది. లోన్ పరిమితి రూ. 20 లక్షల వరకు ఇస్తున్నారు. కనీస డౌన్ పేమెంట్ 10% వరకూ చేయాల్సి ఉంది. ఆన్-రోడ్ ధర ఆధారంగా లోన్ మంజూరు చేస్తున్నారు.

Union Nari Shakti: మహిళలకు ఎలాంటీ పూచీకత్తు లేకుండానే రూ. 2 కోట్ల లోన్ పొందే ఛాన్స్..యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీ శక్తి స్కీం మీ కోసం..!

Next Story