- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Arattai: వాట్సాప్‌కు పోటీగా జోహో నుంచి స్వదేశీ 'అరట్టై' యాప్
ఇటీవల వాట్సాప్‌కు పోటీగా చెన్నైకి చెందిన జోహో కంపెనీ సరికొత్త మెసేజింగ్ యాప్ 'అరట్టై'ని తీసుకొచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం అందరి డిజిటల్ జీవితాల్లో వాట్సాప్ అత్యంత కీలకమైన కమ్యూనికేషన్ సాధనంగా మారిపోయింది. అయితే, దీనికి పోటీగా మనదేశంలో పలు మెసేజింగ్ యాప్‌లు వచ్చినప్పటికీ, వాట్సాప్ వాటిని ధీటుగా ఎదుర్కొని మరీ 50 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్లతో రాణిస్తోంది. అయితే, ఇటీవల వాట్సాప్‌కు పోటీగా చెన్నైకి చెందిన జోహో కంపెనీ సరికొత్త మెసేజింగ్ యాప్ 'అరట్టై'ని తీసుకొచ్చింది. యాపిల్ యాప్ స్టోర్‌లో అరట్టై భారీ డౌన్‌లోడ్‌లతో అగ్రస్థానంలో నిలవడం తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సైతం అరట్టై యాప్‌ను ప్రోత్సహించడం, ప్రజలు దీన్ని వాడాలని పిలుపునిచ్చారు.
అరట్టై గురించి
అరట్టై అనేది చెన్నైకి చెందిన జోహో రూపొందించిన మెసేజింగ్ యాప్. ఇది ప్రపంచ చాట్ దిగ్గజాలకు భారత్‌లో తయారైన ప్రత్యామ్నాయ యాప్‌గా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. 'అరట్టై' అనే పేరుకు తమిళంలో 'సాధారణ సంభాషణ లేదా మాట్లాడటం' అని అర్థం. ఇది టెక్స్ట్ మెసేజింగ్, వాయిస్, వీడియో కాల్స్, మీడియా షేరింగ్, స్టోరీలు, ఛానెల్స్‌కు మద్దతు ఇస్తుంది. ఆధునిక మెసెంజర్‌కు అవసరమైన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా కాల్స్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. మెసేజ్‌లకు ఇంకా ఎనేబుల్ చేయలేదు.
ప్రధానంగా, అరట్టై వినియోగదారులు ఆశించే ముఖ్యమైన అన్ని ఫీచర్లు అందించడంపై దృష్టి పెడుతోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఆడియో, వీడియో కాల్స్‌తో పాటు టెక్స్ట్, వాయిస్ నోట్స్, మీడియా షేరింగ్‌తో వన్-టు-వన్, గ్రూప్ చాట్‌లకు వీలు కల్పిస్తుంది. ఈ యాప్ డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ టీవీతో సహా వివిధ పరికరాలకు సపోర్ట్ చేస్తుంది.
ప్రధానంగా జోహో ఈ యాప్‌ను ప్రైవసీ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వడం మూలంగా వాట్సాప్‌కు గట్టి పోటీ ఇవ్వగలదని ఎక్కువమంది విశ్వసిస్తున్నారు. యాడ్స్ కోసం కస్టమర్ల డేటాను దోపిడీ చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబల్ యాప్‌ల మాదిరిగా కాకుండా, అరట్టై వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఆర్జించదని చెబుతోంది. ఈ హామీ కారణంగానే అరట్టై యాప్ ఎక్కువమందిని ఆకర్షిస్తోంది.
మనదేశంలో వాట్సాప్‌ను అరట్టై భర్తీ చేస్తుందా?
ఈ అంశంపై లోతుగా సమీక్షించడానికి ముందు, మనదేశంలో వాట్సాప్ ఎంత పటిష్టంగా ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాట్సాప్‌ను సవాలు చేసిన యాప్ అరట్టై ఒకటే కాదు. హైక్, టెలిగ్రామ్, వీచాట్, ఇంకా మరిన్నే అటువంటి యాప్‌లు కూడా ప్రయత్నించాయి, కానీ వాట్సాప్ వాటన్నింటినీ అధిగమించింది.
ప్రస్తుతానికి, అరట్టై తక్కువ సమయంలో ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. వాట్సాప్‌తో పోటీ పడటంత్లో ఇది మొదటి అడుగు. అంతేకాకుండా.. స్వదేశీ అనే గుర్తింపుతో అరట్టైకి ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. దీనికి తోడు, కేంద్ర మంత్రుల నుంచి ప్రోత్సాహం లభిస్తుండటం ఈ యాప్‌పై విశ్వసనీయతను మరింత పెంచుతుంది.
ప్రైవసీపై ఆందోళన
ప్రస్తుతానికి అరట్తై యాప్ కాల్స్‌కు మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందిస్తోంది. దీనర్థం.. మెసేజ్‌లకు ఈ సదుపాయం లేకపోవడం వల్ల థర్డ్ పార్టీ వ్యక్తులు వాటిని చూసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మెసేజ్‌లను కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ తీసుకురానున్నారు. ప్రైవసీకి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ అంశం చాలా కీలకం. వాట్సాప్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ యాప్‌తో పోటీ పడుతున్నప్పుడు ఈ కొరతను తీర్చడం అరట్టై బాధ్యత.






