- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఇలా అప్లై చేసుకోండి..!!
LPG Cylinder: కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కూడా ఒకటి.

దిశ, వెబ్ డెస్క్: LPG Cylinder: కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కూడా ఒకటి. ఈ స్కీమును 2016 మే 1 న ఉత్తరప్రదేశ్ లోని బల్లియాలోని ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మహిళలకు అంటే పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మోదీ ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటికే 10కోట్లకుపైగా కుటుంబాలకు సబ్సిడీ ధరలకే సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు కూడా ఈ స్కీమ్ కింద సబ్సిడీ సిలిండర్ పొందాలనుకుంటే ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం పేద కుటుంబాలకు శుభ్రమైన వంట గ్యాస్ కనెక్షన్లు అందించడం. 2016లో ప్రారంభమైన ఈ స్కీమ్ కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దాదాపు 5కోట్లకు పైగా మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కీమ్ కింద అర్హులైన మహిళలకు సిలిండర్ పై రూ. 300 సబ్సిడీ లభిస్తుంది. ప్రస్తుతానికి పీఎంయూవై లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ ధర రూ. 550గా ఉంది. 2025 మార్చి 1 నాటికి భారతదేశంలో 32.94 కోట్ల ఎల్పీజీ వినియోగదారుల్లో 10.33 కోట్ల మంది పీఎంయూవై లబ్దిదారులు ఉన్నారు.
ఉండాల్సిన అర్హతలు
- ఈస్కీమ్ కు దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని అర్హతలు ఉన్నాయి.
- దరఖాస్తు చేసే మహిళలు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి.
- srcc-2011డేటా బేస్ లో ఉన్న బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు అర్హులు.
- ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన తరగతులు, అటవీ నివాసితులు, నదీ ద్వీపాల్లో నివసించే వారు పీఎంఏవై, అంత్యోదయ అన్నయోజన, టీ తోటల కార్మికులు మాజీ కార్మికులు వంటి వర్గాలకు చెందిన మహిళలు అర్హలు
- రేషన్ కార్డు తప్పనిసరి
-ఆదాయపు పన్ను పరిధిలో ఉండకూడదు.
- పురుషులకు ఈ స్కీమ్ కు అర్హత లేదు.
-దరఖాస్తు చేసేవారికి ఇది వరకే గ్యాస్ కనెక్షన్ ఉండరాదు
- ఆధార్ కార్డు ఉండాలి.
-బ్యాంక్ అకౌంట్ ఉండాలి.
-మొబైల్ నెంబర్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం.
ఈ స్కీమ్ దరఖాస్తు చేసుకునే విధానం ఇదే:
-ఈ స్కీమ్ కోసం మీరు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలంటే మీకు దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలతో సమర్పించవచ్చు.
ఆన్ లైన్ లో అయితే దరఖాస్తు చేసుకోవాలంటే మీరు www.pmuy.gov.inలో లాగిన్ అయి PMUY కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.






