- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PM Internship: యువతకోసం మోదీ సర్కార్ కొత్త స్కీమ్..నెలనెలా రూ.5వేలు..చివరి తేదీ ఇదే

దిశ, వెబ్ డెస్క్: PM Internship: యువతలో నైపుణ్యాభివ్రుద్ధిని ప్రోత్సహించేందుకు వారికి కార్పొరేట్ ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగించింది. మొదట ఏప్రిల్ 15గా నిర్ణయించిన తుది గడువును యువత నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ఏప్రిల్ 22, 2025 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈస్కీమ్ 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా పూర్తికాలిక ఉద్యోగాల్లో నిమగ్నమై ఉండని లేదా రెగ్యులర్ కాలేజీలకు హాజరుకాని యువత అయితే గుర్తింపు పొందిన ఆన్ లైన్ దూరవిద్య కోర్సులు చదువుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్లో ఈ స్కీముపై ప్రకటన చేశారు.
దరఖాస్తుదారులకు కనీసం 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు లేదా నిర్థిష్ట రంగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ ప్రాధాన్యం ఉంటుంది. ఈస్కీము ద్వారా ఎంపికైన అభ్యర్థులకు భారతదేశంలోని అత్యుత్తమ 500 కంపెనీల్లో పూర్తి 12 నెలలపాటు ఇంటర్న్ షిప్ చేసే అద్భుతం అవకాశం లభిస్తుంది.
ఈ ఇంటర్న్ షిప్ సమయంలో వారికి ప్రతినెలా రూ. 5,000 స్టైఫండ్ గా అందిస్తారు. ఇందులో ఇంటర్న్ హాజరు, పనితీరుతోపాటుగా ప్రవర్తన ఆధారంగా యజమాని నేరుగా నెలకు రూ. 500 చెల్లిస్తారు. యజమాని ఈ చెల్లింపును ప్రాసెస్ చేసిన తర్వాత భారత ప్రభుత్వం మిగిలిన రూ. 4,500ను నేరుగా ఇంటర్న్ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేస్తుంది. ఈవిధంగా ఏటా రూ. 60వేలు వారికి చేతికి వస్తాయి. అంతేకాదు స్కీము ప్రారంభంలో వారిని ప్రోత్సహించేందుకు ఒకేసారి రూ. 6,000 ప్రత్యేక ప్రోత్సాహక నిధిని కూడా అందిస్తుంటారు. ఈ ఆర్థిక సహాయం యువతకు మరింత ఉత్సాహాన్నిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ (www.pminternship.mc.gov.in) ద్వారా ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ దగ్గర పడుతుంది కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.