Apple: వచ్చే నెలలో యాపిల్ నాలుగో రిటైల్ స్టోర్ ప్రారంభం

by S Gopi |

పూణెలోని కోరెగావ్ పార్క్‌లో తన నాలుగో రిటైల్ స్టోర్ కోసం సిద్ధమవుతున్నట్టు మంగళవారం ప్రకటించింది.

Apple: వచ్చే నెలలో యాపిల్ నాలుగో రిటైల్ స్టోర్ ప్రారంభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ గ్లోబల్ టెక్ సంస్థ యాపిల్ భారత్‌లో తన ఉనికిని మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్ తయారీని పెంచిన కంపెనీ, తాజాగా రిటైల్ స్టోర్ల సంఖ్యను కూడా క్రమంగా పెంచుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాపిల్‌కు రెండు స్టోర్లు ఉండగా, సెప్టెంబర్ 2న బెంగళూరు స్టోర్ ప్రారంభిస్తున్నట్టు ధృవీకరించింది. కొత్తగా పూణెలోని కోరెగావ్ పార్క్‌లో తన నాలుగో రిటైల్ స్టోర్ కోసం సిద్ధమవుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు నెమలి ఆకృతిలో రూపొందించిన ఈ స్టోర్‌ను సెప్టెంబర్ 4న ప్రారంభిస్తామని యాపిల్ వెల్లడించింది. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ స్టోర్‌లో కస్టమర్ల కోసం స్పెషలిస్టులు, క్రియేటివ్స్, జీనియస్‌, బిజినెస్ ఎక్స్‌పర్ట్ సహాయం అందించేందుకు వీలుంగా నిర్వహణ ఉంటుందని కంపెనీ వివరించింది. భారత మార్కెట్లో వృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగానే తయారీని చేపడుతోంది. గతవారమే యాపిల్ వచ్చే నెలలో విడుదల చేయనున్న ఐఫోన్ 17 సిరీస్ అన్ని మోడళ్లను భారత్‌లోనే తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికాకు ఎక్కువ ఎగుమతులు చేయడంపై యాపిల్ ఎక్కువ దృష్టి సారించింది.

Next Story