- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Apple: టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం.. కొత్త సీఈవోగా జాన్ టెర్నస్
టెక్ దిగ్గజం యాపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన సీఈఓగా హార్డ్‌వేర్ దిగ్గజం జాన్ టెర్నస్ నియమించనుంది.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ టెక్ దిగ్గజం ‘యాపిల్’ (Apple) తన తదుపరి నాయకత్వ మార్పుపై కీలక ప్రకటన చేసింది. గత 15 ఏళ్లుగా కంపెనీని విజయపథంలో నడిపిస్తున్న టిమ్ కుక్ (Tim Cook) సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో యాపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం అధిపతిగా ఉన్న జాన్ టెర్నస్ (John Ternus) కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, సెప్టెంబర్ 1 నుంచి జాన్ టెర్నస్ పూర్తిస్థాయి సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు.
ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా టిమ్ కుక్..
సీఈవో పదవికి రాజీనామా చేసినప్పటికీ, టిమ్ కుక్ కంపెనీని పూర్తిగా వదిలి వెళ్లడం లేదు. ఆయన యాపిల్ బోర్డుకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతూ కంపెనీకి దిశానిర్దేశం చేస్తారు. ఇక 2001లో యాపిల్‌లో చేరిన జాన్ టెర్నస్, ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి యాపిల్ దిగ్గజ ఉత్పత్తుల రూపకల్పనలో ఈయన కీలక పాత్ర పోషించారు. కంపెనీ సంస్కృతిని, టెక్నాలజీని వంటబట్టించుకున్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. 2011లో స్టీవ్ జాబ్స్ మరణం తర్వాత యాపిల్ పగ్గాలు చేపట్టిన టిమ్ కుక్, కంపెనీని టాప్‌లో నిలిపారు. ఆయన హయాంలో యాపిల్ మార్కెట్ విలువ 350 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు 4 ట్రిలియన్ డాలర్లకు పెరగడం విశేషం.






