రూ. 30 వేలకే iPhone 14.. Flipkart బంపర్ ఆఫర్

by Disha Web Desk 17 |
రూ. 30 వేలకే iPhone 14.. Flipkart బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. గత ఏడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 అసలు ధర రూ. 79,900. కానీ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 14 శాతం (రూ. 11,901)తగ్గింపుతో రూ. 67,999 కే అమ్మకానికి అందుబాటులో ఉంచింది. అదనంగా కొనుగోలు సమయంలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4000 తగ్గింపును కూడా పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ. 63,999కి తగ్గుతుంది. అలాగే, పాత స్మార్ట్‌ఫోన్‌‌ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే రూ. 33,000 వరకు తగ్గింపు వస్తుంది. దీంతో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ రూ. 30,999 కే లభిస్తుంది. Apple iPhone 14 స్మార్ట్ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా, వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 12MP కెమెరాను కలిగి ఉంది.


Next Story

Most Viewed