Apple: టెక్ దిగ్గజం యాపిల్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వ ఏజెన్సీ భారీ జరిమానా

by S Gopi |

ఐఓఎస్, ఐప్యాడ్ పరికరాల్లో యూజర్ల డేటాను రక్షించే క్రమంలో యాపిల్‌కు చెందిన ఏటీటీ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్వహిస్తోంది.

Apple: టెక్ దిగ్గజం యాపిల్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వ ఏజెన్సీ భారీ జరిమానా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఐఓఎస్ వినియోగదారుల డేటా గోప్యతకు సంబంధించిన అంశంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఆధిపత్య ధోరణిని దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఫ్రాన్స్ ప్రభుత్వ ఏజెన్సీ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ భారీ జరిమానా విధించింది. ఐఓఎస్, ఐప్యాడ్ పరికరాల్లో యూజర్ల డేటాను రక్షించే క్రమంలో యాపిల్‌కు చెందిన యాప్ ట్రాకింగ్ ట్రాన్స్‌పరెన్సీ(ఏటీటీ) ఫ్రేమ్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. అయితే, యాపిల్ సిస్టమ్స్‌లో థర్డ్ పార్టీ యాప్‌లు డేటా సేకరించాలంటే తప్పనిసరిగా ఆయా డివైజ్‌లను వాడుతున్న యూజర్ల అనుమతి ఉండాలి. దీనివల్ల యూజర్ల గోప్యత అంటూ యాప్-మేకర్‌లను యూరప్ నియమాలకు అనుగుణంగా అనుమతించడం లేదని యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ తెలిపింది. ఇందులో భాగంగా యాపిల్‌కు 150 మిలియన్ యూరోలు(మన కరెన్సీలో రూ. 1,386 కోట్లు) జరిమానా విధించింది. యాపిల్ ఏటీటీ ఫ్రేమ్‌వర్క్ యూజర్ల గోప్యతను కాపాడటం మంచిదే అయినప్పటికీ, దాన్ని అమలు చేస్తున్న విధానంలో కంపెనీ లక్ష్యాలకు అనుగుణంగా లేదని ఆరోపణలు పెరిగాయి. ఈ అంశంపై దర్యాప్తు నిర్వహించిన ఫ్రాన్స్ ఏజెన్సీ మొబైల్ యాప్‌ల విషయంలో యాపిల్ సంస్థ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు తేలిచింది. దీనివల్ల థర్డ్ పార్టీ యూజర్లు ఐఓఎస్ సిస్టమ్స్‌లో వెళ్లడం సమస్యగా మారింది. ఈ నిర్ణయంపై స్పందించిన యాపిల్ కంపెనీ తాము అనుసరిస్తున్న ఏటీటీ ఫ్రేమ్‌వర్క్‌కు యూజర్ల నుంచి సానుకూల స్పందన వస్తోందని, ఫ్రాన్స్ ఏజెన్సీ నిర్ణయం అసంతృప్తిగా ఉందని వెల్లడించింది.

Next Story