- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Apple: రూ. 799కే యాపిల్ కేర్ ప్లస్ కవరేజీ
ఐఫోన్ 13 మొదలుకొని ఐఫోన్ ఎస్ఈ వరకు అన్ని ఫోన్‌లకు ఇది వర్తిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం యాపిల్ దేశీయంగా తన యాపిల్‌కేర్ ప్లస్ సేవలను విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. యాపిల్‌కేర్ ప్లస్ కవరేజీ ఆప్షన్లకు సంబంధించి మరింత సరసమైన ధరలో నెలావారీ, వార్షిక ప్లాన్‌లను తీసుకొచ్చినట్టు తెలిపింది. దీని ద్వారా ఐఫోన్‌లను పోగొట్టుకున్నా లేదా దొంగతనం జరిగినా ఏడాదిలో రెండుసార్లు కవరేజీ పొందే వీలుంటుంది. ఐఫోన్ 13 మొదలుకొని ఐఫోన్ ఎస్ఈ వరకు అన్ని ఫోన్‌లకు ఇది వర్తిస్తుంది. గతంలో ఆపిల్‌కేర్ ప్లస్ కింద ప్రమాదవశాత్తు జరిగిన నష్టానికి అన్‌లిమిటెడ్ రిపేర్ అవకాశం ఉండేది. అయితే కంపెనీ కొన్ని దేశాల్లో దొంగతనం, లాస్ ప్రొటెక్షన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇప్పుడు దీన్ని భారత మార్కెట్లోనూ అందించాలని నిర్ణయించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, యాపిల్‌కేర్ ప్లస్ ద్వారా ఇప్పటికే ఉన్న ఏడాది హార్డ్‌వేర్ వారెంటీ రెండేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. అనుకోకుండా జరిగే డ్యామేజ్‌లకు అన్‌లిమిటెడ్ సదుపాయం, ఇప్పటికే ఉన్న 90 రోజుల ఉచిత టెక్నికల్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
ఇక, ఇదివరకు అందుబాటులో ఉన్న వార్షిక చెల్లింపు ఆప్షన్‌తో పాటు కొత్తగా రూ. 799 నుంచి ప్రారంభమయ్యే నెలవారీ ప్లాన్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. దీంతో యాపిల్‌కేర్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇప్పుడు మరింత సరసమైన ధరకు లభిస్తుంది. దేశీయ కస్టమర్లకు మరింత తక్కువ ఖర్చుతో అందించేలా ఈ ప్లాన్ తెచ్చామని కంపెనీ వైస్-ప్రెసిడెంట్ కయాన్ డ్రాన్స్ అన్నారు. కస్టమర్లు తమ కొత్త ఐఫోణ్ కొన్న వెంటనే లేదా 60 రోజుల్లోగా యాపిల్ కేర్ ప్లస్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇందులో భాగంగా బ్యాటరీ రీప్లేస్‌మెంట్, 24 గంటల ప్రయారిటీ సపోర్ట్ లాంటి ప్రయోజనాలు లభిస్తాయి. యాపిల్‌కేర్ ప్లస్ కవరేజీ ప్లాన్‌లు, వాటి ధర స్మార్ట్‌ఫోన్ బట్టి మారుతుంది.






