- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anthropic: భారత్‌లో కొత్త కార్యాలయం ప్రారంభించిన ఆంథ్రోపిక్
డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఆంథ్రోపిక్ ఈ నిర్ణయం తీసుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపుతూ దేశంలోనే తొలిసారి అంతర్జాతీయ ఏఐ సదస్సు ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్లోబల్ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ బెంగళూరులో తన కొత్త కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించింది. అత్యాధునిక టెక్నాలజీ కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఆంథ్రోపిక్ ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని కార్యాలయం టోక్యో తర్వాత ఆసియా-పసిఫిక్‌లో రెండో కార్యాలయమని చెబుతోంది. భారత మార్కెట్ ఆంథ్రోపిక్‌కు రెండో అత్యధిక యాక్టివ్ యూజర్లు ఉన్న ప్రాంతం. కొత్త కార్యాలయం ద్వారా కంపెనీ దేశీయంగా విద్య, వ్యవసాయం, డిజిటల్ సేవలతో పాటు వివిధ రంగాల్లో కార్యకలాపాలను పెంచాలని భావిస్తోంది. భారత మార్కెట్లో సురక్షితమైన, విశ్వాసంతో కూడిన ఏఐ సొల్యూషన్స్ అందించేందుకు పనిచేస్తాం. ముఖ్యంగా బాధ్యతాయుత ఏఐ అభివృద్ధి, వినియోగంపైనే తమ దృష్టి ఉంటుందని, ఏఐ ఉత్పాదకతను పెంచే సాధనంగా మాత్రమే కాకుండా సమాజానికి మేలు చేసేలా ఉపయోగించాలని ఆంథ్రోపిక్ పేర్కొంది.






