సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు!

by Jakkula.Mamatha |

సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది.

సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు!
X

దిశ,వెబ్‌డెస్క్: సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే నిత్యావసరాలకు పెరిగిన ధరల(prices)తో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల నెత్తిన మరో పిడుగు పడింది. దేశవ్యాప్తంగా కోడిగుడ్ల(eggs) ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో హోల్ సేల్ మార్కెట్లలో(wholesale markets) ధర రూ. 5.90గా NECC నిర్ణయించింది. దీంతో రిటైల్ మార్కెట్లో రూ. 6.50 నుంచి 7 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే చలికాలం(winter)లో గుడ్డు వినియోగం పెరగడం, క్రిస్మస్(Christmas), న్యూ ఇయర్(New Year) కోసం కేకులు తయారీలో కోడి గుడ్లను వాడడం వల్ల రేట్లు పెరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు కోడిగుడ్ల(eggs) ధరలు మరింత పెరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సామాన్యులు షాక్ అవుతున్నారు.

Next Story