Medicine Prices: సామాన్యుడికి మరో షాక్.. పెరిగిన 900 రకాల మందుల ధరలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-01 10:08:25  IST  )

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది.

Medicine Prices: సామాన్యుడికి మరో షాక్.. పెరిగిన 900 రకాల మందుల ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. యాంటీ బయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌, గుండె జబ్బులు, మధుమేహానికి సంబంధించిన మందులు సహా దాదాపు 900 రకాల టాబ్లేట్స్ ధరలు (Medicine Prices) పెరిగాయి. నేటి (April 1) నుంచే ఈ ధరల పెరుగుల అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని జాతీయ ఔషధ ధరల అథారిటీ (National Pharmaceutical Pricing Authority) వెల్లడించింది.

ఔషధాల (ధరల నియంత్రణ) చట్టం- 2013 (DPCO, 2013) నిబంధనల ప్రకారం షెడ్యూల్ చేసిన మందుల ధరలు హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) ఆధారంగా ప్రతి ఏటా సవరిస్తారు. WPI ఆధారంగా ఔషధ తయారీదారులు ప్రతి ఏడాది గరిష్ట రిటైల్ ధరలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వీరు కేంద్రం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక 2023తో పోలిస్తే 2024 క్యాలెండర్‌ సంవత్సరంలో నమోదైన WPI ఆధారంగా ఔషధ ధరలను గరిష్ఠంగా 1.74 శాతం వరకు ధరలు పెరిగినట్లు NPPA పేర్కొంది.

సవరించిన ధరల ప్రకారం..

* యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ 250mg ఒక్కో టాబ్లేట్ ధర రూ.11.87, 500mg ధర రూ.23.97కు పెరిగింది.

* అమోక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్ కలిగిన యాంటీబయాటిక్ డ్రై సిరప్ ధర ఒక్కో ml గరిష్ఠ ధరను రూ.2.09గా నిర్ణయించారు.

* డైక్లోఫెనార్ (పెయిన్ కిల్లర్) టాబ్లెట్ గరిష్ఠ ధర రూ.2.09 అయింది.

* ఇబుప్రోఫెన్ (పెయిన్ కిల్లర్) 200mg ఒక టాబ్లెట్ ధర రూ.0.72 కాగా.. 400mg టాబ్లెట్ ధర రూ.1.22కు పెరిగింది.

* డయాబెటిస్ మందులు (డపాగ్లిఫ్లోజిన్ + మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ + గ్లిమెపిరైడ్) ఒక టాబ్లెట్ దాదాపు రూ. 12.74లుగా నిర్ణయించారు.

* జ్వరం, చెవి, కంటి, ముక్కు, అనస్తీషియా, గుండె, విటమిన్, డయాబెటిస్ తోపాటు గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని ఔషధాల ధరలను స్వల్పంగా పెంచి వాటి గరిష్ఠ పరిమితులను NPPA తన వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Next Story