SBI: ఆర్‌బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల రేట్ల తగ్గించడం మంచిది: ఎస్‌బీఐ రీసెర్చ్

by S Gopi |

వరుసగా మూడుసార్లు రెపోరేటు తగ్గించిన తర్వాత, ఆగష్టులో యథాతథంగా ఉంచింది.

SBI: ఆర్‌బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల రేట్ల తగ్గించడం మంచిది: ఎస్‌బీఐ రీసెర్చ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రేట్లకు సంబంధించి మరింత కోత విధించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం రంగ దిగ్గజం ఎస్‌బీఐ తన తాజా నివేదికలో పేర్కొంది. రాబోయే పాలసీ సమావేశాల్లో మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడానికి వీలుది. ఎందుకంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం స్థిరంగానే కొనసాగుతుందని ఎస్‌బీఐ రీసెర్ అభిప్రాయపడింది. వినియోగదారు ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి సమావేశం నుంచి ఆర్‌బీఐ 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వరుసగా మూడుసార్లు రెపోరేటు తగ్గించిన తర్వాత, ఆగష్టులో యథాతథంగా ఉంచింది. ఈ నెలాఖరులో జరగబోయే సమావేశంలో మరోసారి రెపో రేటును తగ్గించడం సరైన నిర్ణయమవుతుంది. ద్రవ్యోల్బణంపై సానుకూల అంచనాలను పరిగణనలోకి తీసుకుని, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి ఆర్‌బీఐ సెప్టెంబర్ 29-అక్టోబర్ 1 తేదీల మధ్య జరిగే ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో రేటు కోతను ఎంచుకోవచ్చని తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణం మార్చిలో 67 నెలల కనిష్ట స్థాయి 3.34 శాతానికి చేరుకోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 125-150 బేసిస్ పాయింట్ల వరకు కోత ఉంటుందని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.

Next Story