Anil Ambani: మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ రూ. 3,716 కోట్ల ముంబై ఇల్లు అటాచ్

by S Gopi |

ముంబైలోని పాల్‌హిల్ ప్రాంతంలో ఉన్న రూ.3,716.83 కోట్ల విలువైన 'అబోడ్'ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Anil Ambani: మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ రూ. 3,716 కోట్ల ముంబై ఇల్లు అటాచ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి సంబంధించి మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన నివాసం 'అబోడ్'ను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ముంబైలోని పాల్‌హిల్ ప్రాంతంలో ఉన్న రూ.3,716.83 కోట్ల విలువైన 17 అంతస్తుల నివాసం 'అబోడ్'ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ కేసులో అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.15,700 కోట్లకు పెరిగింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలు రూ. 40 వేల కోట్లకుపైన బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జరిగిన జప్తు రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్)తో సంబంధం ఉన్న కేసులో భాగంగా జరిగింది. కాగా, నేడు(ఫిబ్రవరి 26) అనిల్ అంబానీ మరోసారి ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసు కింద అనిల్ అంబానీ స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకు 2025, ఆగస్టులో ఆయన మొదటిసారిగా ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.

Next Story