- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసిన రిలయన్స్
'ఆపరేషన్ సిందూర్ ' ను వర్క్‌మార్క్‌గా నమోదు చేయాలని కోరుతూ ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ వద్ద దరఖాస్తు చేసినట్టు పేర్కొంది

దిశ, బిజినెస్ బ్యూరో: పెహల్గాం దాడికి ప్రతీకారంగా బుధవారం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు నిర్వహించింది. ఈ దాడుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్ ' అనే కోడ్ నేమ్‌ను ఎంచుకుంది. తాజాగా ఈ పేరు ట్రేడ్‌మార్క్ కోసం పలు సంస్థలు హడావుడిగా దర్ఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా బిలీయనీర్ ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ కూడా ఉంది. 'ఆపరేషన్ సిందూర్ ' ను వర్క్‌మార్క్‌గా నమోదు చేయాలని కోరుతూ ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ వద్ద దరఖాస్తు చేసినట్టు లైవ్‌లా నివేదిక పేర్కొంది. ఈ ట్రేడ్ మార్క్‌ను గూడ్స్ అండ్ సర్వీసెస్ క్లాస్ 41 కింద నమోదు చేయాలని కంపెనీ కోరింది. ఈ విభాగంలో ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు ఉంటాయి. ముఖేష్ అంబానీతో పాటు ఆపరేషన్ సిందూర్ పదం కోసం చైత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, అలోక్ కొఠారి అనే ముగ్గురు వ్యక్తులు కూడా ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా, భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేశాయి. వీటిలో జైష్-ఎ-మొహమ్మద్ బలంగా ఉన్న బహవల్పూర్, లష్కరే-ఎ-తోయిబా స్థావరం మురిడ్క్ కూడా ఉన్నాయి.






