Mukhesh Ambani: మళ్లీ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ముఖేష్ అంబానీ

by S Gopi |

ప్రధానంగా రిలయన్స్‌తో పాటు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కంపెనీ అధిక లాభాలను చూసింది.

Mukhesh Ambani: మళ్లీ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ముఖేష్ అంబానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. మార్చి నెల మూడోవారం నుంచి భారత స్టాక్ మార్కెట్లలో జరిగిన ర్యాలీ, విదేశీ పెట్టుబడులు మళ్లీ మన మార్కెట్లలో నిధులు పెట్టడం, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంబానీతో పాటు బడా బిలియనీర్ల సంపద విలువ పుంజుకుంది.ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ ర్యాంకింగ్స్ ప్రకారం.. గడిచిన రెండు నెలల వ్యవధిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద దాదాపు 20 బిలియన్ డాలర్లు(రూ. 1.7 లక్షల కోట్లు) పెరిగింది. దీంతో ఆయన సంపద మొత్తం 106.1 బిలియన్ డాలర్ల(రూ. 8.97 లక్షల కోట్ల)కు చేరుకుంది. మార్చి నెల ప్రారంభంలో ముఖేష్ అంబానీ సంస్థ విలువ 81 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రధానంగా రిలయన్స్‌తో పాటు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కంపెనీ అధిక లాభాలను చూసింది. ఫలితంగా ఈ కంపెనీల షేర్లలో వరుసగా 25 శాతం, 29 శాతం పుంజుకున్నాయి. అయితే, ఇప్పటికీ ముఖేష్ అంబానీ సంపద 2024, జూలై 8 నాటికి 120.8 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి దాదాపు 20 శాతం తక్కువగా ఉంది.

మరోవైపు, ఇదే సమయంలో గుతమ్ అదానీ సంపద కూడా పెరిగినప్పటికీ, 2024 గరిష్ట స్థాయి కంటే 57 శాతం తక్కువగా ఉంది. మార్కెట్ల ర్యాలీ ద్వారా గౌతమ్ అదానీ సంపద 61.8 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే, 2024, జూన్ 3 నాటి 120.8 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి కంటే 57 శాతం వెనుకబడి ఉన్నారు. సన్‌ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వీ సంపద రూ. 41.45 వేల కోట్ల లాభాలతో రూ. 2.43 లక్షల కోట్లకు, భారతీ ఎయిర్‌టెల్ యజమాని నవీన్ మిట్టల్ సంపద కూడా అంతే స్థాయిలో పెరిగి రూ. 2.31 లక్షల కోట్లతో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. రాధాకిషన్ దమానీ, సావిత్రి జిందాల్, లక్ష్మీ మిట్టల్, ఉదయ్ కోటక్ వంటి బిలియనీర్ల సంపద కూడా గణనీయంగా పెరిగింది.

Next Story